Tuesday, September 10, 2019

Bit paper removed from 10th class public examinations



Read also:

Bit paper removed from 10th class public examinations

100 మార్కులకు రాత పరీక్ష
ప్రతీ పేపర్‌లోనూ 18మార్కులు సాధించాల్సిందే
ప్రభుత్వానికి ప్రతిపాదనలు.
bitpaper
ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో బిట్‌ పేపర్‌ను తొలగించనున్నారు. ప్రశ్నపత్రంలోనే బహుళైచ్చిక ప్రశ్నలు ఇవ్వనున్నారు. 
 
  1. ప్రశ్నపత్రం నమూనా పూర్తిగా మారనుంది. కొత్తగా రూపొందించిన నమూనా ప్రశ్నపత్రాన్ని పాఠశాల విద్యాశాఖ సోమవారం ప్రభుత్వానికి పంపింది. 
  2. దీనిపై ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది. గతంలో 20 అంతర్గత మార్కులు ఉండగా వాటిని తొలగించారు. 
  3. దీంతో 100మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. హిందీ మినహా ప్రతి సబ్జెక్టుకు 2 పేపర్లు ఉంటాయి. 
  4. ఇప్పటి వరకు 2 పేపర్లలో కలిపి 35 మార్కులు వస్తే ఉత్తీర్ణత సాధించినట్లుగా పరిగణిస్తున్నారు. 
  5. కొత్త విధానం ప్రకారం ప్రతి పేపర్‌లోనూ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఈ లెక్కన 18 మార్కులు సాధిస్తేనే ఉత్తీర్ణులైనట్లు పరిగణిస్తారు. 
  6. జవాబు రాసే పేపర్లను బుక్‌లెట్‌ విధానంలో ఇవ్వాలని నిర్ణయించినా దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
  7. ప్రశ్నపత్రం నమూనా ఇలా
  8. అర మార్కు ప్రశ్నలు 12 ఇస్తారు. వీటిని నేరుగా ప్రశ్నపత్రంలోనే ఇస్తారు. వీటిల్లో బహుళైచ్చికాలు, ఖాళీలు, జతపర్చడంలాంటివి ఉంటాయి. జవాబు పత్రంలో సమాధానాలు రాయాల్సి ఉంటుంది.
  9. ఒక మార్కు ప్రశ్నలు 8 ఉంటాయి. వాటికి 2, 3 లైన్లలో సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది.
  10.  మార్కుల ప్రశ్నలు 8, నాలుగు మార్కులవి 5 ఉంటాయి. మొత్తం 50 మార్కుల ప్రశ్నపత్రం ఉంటుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :