Read also:
కళ్ళు చెదిరేలా BSNL నుంచీ మరో సంచలన ప్లాన్
టెలి రంగంలో దూసుకువెళ్తున్న జియో కి మిగిలిన పోటీ నెట్వర్క్ లు ధీటుగా సమాధానం ఇవ్వాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి . ముఖ్యంగా BSNL ఈ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు . జియో కి ధీటుగా ఉండటానికి అనేక కొత్త డేటా ప్లాన్స్ ని ఆవిష్కరిస్తోంది . ఈ క్రమంలోనే తాజాగా ఒక్క రోజుకి 33GB డేటా అందిస్తూ సంచలన ప్రకటన చేసింది . BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ రూ . 1999 ని తాజాగా విడుదల చేసింది . భారత ఫైబర్ లలో ఒక ప్లాన్ గా ఉంటుంది . ఈ ప్లాన్ లో 100mbps వేగం అందుకుంటుంది . అంతేకాదు ప్రతీ రోజు 33GB డేటా తో హై స్పీడ్ ఇంటర్నెట్ పొందవచ్చు . అయితే ఒక్క రోజులు మీరు 33gb డేటాని పూర్తిగా వాడినట్లయితే 100mbps నుంచీ ఈ స్పీడు 4mbps కి తగ్గించబడుతుందని ప్రకటించింది . ఈ ప్లాన్ లో లోకల్ మరియు జాతీయంగా అపరిమిత కాల్స్ ని అందిస్తున్నట్లుగా సంస్థ తెలిపింది . అయితే రోజు వారి పరిమితి దాటినా తరువాత ఒక్క సారిగా 4mbps కి స్పీడు తగ్గిపోవడం అనేది జియో కి అడ్వాంటేజ్ అవుతుందనేది టెక్ నిపుణుల అభిప్రాయం . మరి ఈ ప్లాన్ BSNL కి ఏ మేరకు లాభం తెచ్చి పెడుతుందో , జియో తో పోటీ పడగలదో లేదో వేచి చూడాలి.