Tuesday, September 24, 2019

Ap Traffic updated chalana fines list



Read also:

ఏపీలో ట్రాఫిక్ జరిమానాలు ఇవే

దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేసిన కొత్త ట్రాఫిక్ జరిమానాలతో వాహనదారులు భయపడుతున్నారు. రూల్స్ బ్రేక్ చేస్తే ఒక్కో వాహనానికి వేలు, లక్షల రూపాయల చలాన్లు రాస్తున్నారు. ఈ జరిమానాలు కట్టలేక దేశం మొత్తం గగ్గోలు పెడుతూ నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే కేంద్రం సూచించిన జరిమానాలు తగ్గించగా తాజాగా ఏపీ కూడా జరిమానాలు తగ్గించే దిశగా అడుగులు వేస్తోంది. జగన్ సర్కార్ ఈ ట్రాఫిక్ నిబంధనలను అమలుపరిచేకంటే ముందు ఈ నిబంధనల గురించి, జరిమానాల గురించి తొలుత ప్రజల్లో అవగాహన తీసుకురావాలని భావించింది.

ఈ నూతన జరిమానాలవల్ల సామాన్యులు అధికంగా ఇబ్బందిపడుతున్నారని గ్రహించిన అధికారుల బృందం జరిమానాలు తగ్గించాలని నిర్ణయించింది.

ఈ క్రమంలోనే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారిపై కేంద్రం సిఫార్సు చేసిన భారీ జరిమానాలను ఆంధ్రప్రదేశ్ లో అమలు చేయవద్దని రవాణా అధికారుల కమిటీ నుంచి ప్రభుత్వానికి సిఫార్సులు అందాయి.

రాష్ట్రంలో అన్ని కేటగిరీల వాహనాలు 90 లక్షలకు పైగా ఉన్నాయి. వీటిని నడిపే వారిలో 45 శాతం మందికి లైసెన్సు లేనట్లు రవాణ శాఖ గతంలో నిర్వహించిన సర్వేలో తేలింది. జరిమానాలు తగ్గించాలని నిర్ణయించిన బృందం వీటిపై బాగా కసరత్తులు చేసి తమ నివేదికను ముఖ్యమంత్రి కార్యాలయానికి ఇచ్చింది. ఇక ఏపీలో అమలు చేయాలనుకుంటున్న జరిమానాలు చూస్తే.

రోడ్డు నిబంధనలు అతిక్రమిస్తే - 250 (కేంద్రం 500)
లైసెన్సు లేకుండా బండి నడిపితే - 2500 (కేంద్రం 5000)
అర్హత లేకుండా వాహనం నడిపితే - 4 వేలు (కేంద్రం 10వేలు)
ఓవర్ లోడింగ్ - 750 (కేంద్రం 2వేలు)
డ్రంకెన్ డ్రైవ్ - 5వేలు (కేంద్రం 10వేలు)
ఇన్సూరెన్స్ లేకపోతే - 1250 (కేంద్రం 2వేలు)
సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే - 500 (కేంద్రం 1000)
పర్మిట్ లేకుంటే - 6500 (కేంద్రం 10 వేలు)

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :