Sunday, September 22, 2019

AP Grama sachivalayam merit list district wise2019



Read also:

AP Grama sachivalayam merit list district wise2019

merit;ist

నేడు వెబ్ సైట్ లో షార్ట్ లిస్టులు 

  • ఉ.11గంటలకు జిల్లాల వారీగా “సచివాలయ’ పరీక్షల్లో పాసైన వారి జాబితాలు 
  • నేడు, రేపు సర్టిఫికెట్ల స్కాన్డ్ కాపీలను అభ్యర్థులు అప్లోడ్ చేయాలి 
  • 23, 24, 25 తేదీల్లో ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 
  • అపాయింట్ మెంట్ లెటర్ల జారీ బాధ్యత జిల్లా సెలక్షన్ కమిటీలదే.

AP Grama Sachivalayam Call Letter Download

రాతపరీక్షల ఫలితాల్లో జిల్లాలవారీగా మెరిట్‌ జాబితాలను వర్గీకరించి ఆయా ప్రాంతాలకు పంపారు. కలెక్టర్‌ ఆధ్వర్యంలోని జిల్లా సెలక్షన్‌ కమిటీ (డీఎస్సీ)లు పోస్టుల సంఖ్య ఆధారంగా రిజర్వేషన్ల ప్రకారం మెరిట్‌ అభ్యర్ధులకు కాల్‌ లెటర్లు పంపిస్తాయి. ఎంపికైన వారికి శని, ఆదివారాల్లో కాల్‌ లెటర్లు అందుతాయి. ఎంపికైన అభ్యర్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లను స్కాన్‌ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి. 23, 24, 25వ తేదీల్లో జరిగే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు జిల్లా యంత్రాంగం నిర్దేశించిన చోట హాజరు కావాలి.

Certificates Verification Schedule

గ్రామ సచివాలయాల పరీక్ష ఫలితాల ప్రకటన అనంతరం, అర్హులైన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్‌లను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి.తరువాత జిల్లా యంత్రాంగం ద్వారా తెలుపబడిన తేదిలలో నిర్ణీత ప్రదేశములకు వెళ్లి వారి సర్టిఫికేట్‌లను తనిఖీ చేయించుకోవాలి.

వెరిఫికేషన్ షెడ్యూల్ (Verification Schedule):

వెబ్‌సైట్ సర్టిఫికెట్ల అప్‌లోడ్‌21.09.2019 నుండి.
కాల్ లెటర్ పంపిణి21.09.2019 – 22.09.2019
వెరిఫికేషన్23-25 సెప్టెంబర్ 2019
నియామక ఉత్తర్వుల జారీ27.09.2019
అవగాహనా కార్యక్రమం1 & 2 అక్టోబర్ 2019
 గ్రామ/వార్డు సచివాలయాలు ప్రారంభం02.10.2019

వెరిఫికేషన్‌ సమయంలో అభ్యర్థులు అధికారులకు చూపాల్సిన సర్టిఫికెట్ల వివరాలు.

►అభ్యర్థి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన అనంతరం వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న పత్రం.
►ఎస్‌ఎస్‌సీ సర్టిఫికెట్‌ లేదా అధికారుల నుంచి తీసుకున్న పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం.
►ఒరిజనల్‌ సర్టిఫికెట్లు, మార్కుల మెమోలు.
►నాలుగో తరగతి నుంచి పదో తరగతి మధ్య ఎక్కడ చదివారన్న వివరాలతో స్టడీ సర్టిఫికెట్లు.
►స్కూలు, కాలేజీల్లో చదవకుండా డైరెక్ట్‌ డిగ్రీ వంటి కోర్సులు చేసిన వారి నివాస ధ్రువీకరణ పత్రం.
►రాష్ట్ర విభజన సమయంలో ప్రభుత్వ నోటిఫికేషన్‌ మేరకు తెలంగాణ ప్రాంతం నుంచి ఏపీకి స్థానికత మార్చుకున్నప్పుడు సంబంధిత అధికారులు జారీ చేసిన సర్టిఫికెట్‌.
►చెవిటి, మూగ వైకల్యంతో ప్రత్యేక స్కూళ్లలో చదువుకున్న వారు.. వారి తల్లిదండ్రుల నివాసిత ధ్రువీకరణ పత్రం.
►బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రం.
►బీసీ అభ్యర్థులు తాజాగా తహసీల్దార్‌ జారీ చేసిన నాన్‌ క్రిమిలేయర్‌ సర్టిఫికెట్‌.
►దివ్యాంగ అభ్యర్థులు సదరం క్యాంపుల ద్వారా పొందిన మెడికల్‌ సర్టిఫికెట్‌.
►ప్రస్తుతం ఆయా ఉద్యోగాల్లో కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తూ వెయిటేజీ పొంది.. ఈ నియామక ప్రక్రియలో ఎంపికైన వారు తమ శాఖాధిపతి నుంచి పొందిన ఇన్‌ సర్వీసు సర్టిఫికెట్‌.
►తనపై ఎలాంటి క్రిమినల్‌ కేసులు లేవని సెల్ఫ్‌ సర్టిఫైడ్‌ కాపీ. దీనికి సంబంధించిన నిర్ణీత ఫార్మాట్‌ను వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

How to Download and check ranks in the official website


Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :