Saturday, September 14, 2019

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్చరిక



Read also:

ఆ శిక్ష కఠినం
ఉద్యోగులు తప్పు చేస్తే 'పునరుద్ధరణకు వీలులేని' ఇంక్రిమెంట్‌ నిలుపుదల
ఆర్థికంగా నష్టం.పదోన్నతులకూ ఇబ్బంది
నంద్యాల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నియమావళిని ఉల్లంఘిస్తే 'పునరుద్ధరణకు వీలులేని ఇంక్రిమెంట్‌ను నిలుపుదల' శిక్షగా పడుతుంది. క్రమశిక్షణా చర్యల కింద నియామకాధికారి ఈ శిక్ష విధించే అవకాశం ఉంది. విధుల్లో తప్పులు చేసేవారికి తేలికపాటి శిక్షలు (మైనర్‌ పెనాల్టీస్‌), కఠిన శిక్షలు (మేజర్‌ పెనాల్టీస్‌) ఉంటాయి. చేసిన తప్పుల తీవ్రత, ప్రభావం చూసిన అంశాలను పరిగణలోనికి తీసుకుని శిక్షలు అమలు చేస్తారు.
ఉద్యోగి నేర తీవ్రత ఎక్కువగా ఉంటే విధించే అతి కఠిన శిక్షల్లో పునరుద్ధరణకు వీలులేని ఇంక్రిమెంట్‌ను నిలుపుదల (స్టాప్‌ ఏజ్‌ ఆఫ్‌ ఇంక్రిమెంట్‌ విత్‌ క్యుములేటీవ్‌ ఎఫెక్ట్‌) ఒకటి. ఈ శిక్ష పడిన ఉద్యోగికి వార్షిక ఇంక్రిమెంట్‌ను ఒకటి లేదా రెండు సంవత్సరాల వరకు పునరుద్ధరణకు వీలులేకుండా నిలిపివేయవచ్చు. అంటే శిక్షకు గురైన ఉద్యోగి శాశ్వతంగా ఈ ఇంక్రిమెంట్‌ కోల్పోతాడు. శిక్ష పడిన ఉద్యోగులకు అన్ని అర్హతలు ఉన్నా ఎన్ని సంవత్సరాలపాటు ఇంక్రిమెంట్లు నిలుపుదల చేస్తే..

అంతకు రెట్టింపు సంవత్సరాలు పదోన్నతి పొందే వీలు ఉండదు. పీఆర్‌సీ అమలు చేసే సమయంలో మిగతావారి కన్నా శిక్ష పడిన ఉద్యోగులకు పే ఫిక్సెషన్‌ తక్కువగా నిర్ధారిస్తారు. పెన్షన్‌, గ్రాట్యుటీ, కమ్యుటేషన్‌, ఫ్యామిలీ పెన్షన్‌ శిక్ష పడిన ఉద్యోగులకు తక్కువగా నిర్ధారిస్తారు. ఇలాంటి కాల పరిమితి శిక్షలన్నీ తప్పు చేసిన ఉద్యోగులకు ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నుంచి వర్తిస్తాయి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :