Monday, September 9, 2019

వాట్సప్లో మరిన్ని అదిరిపోయే ఫీచర్లు



Read also:

ప్రపంచంలో నెంబర్ వన్ మెసేజింగ్ యాప్ . పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకూ వాట్సప్ లేకుండా ఇప్పడు చాలా మందికి రోజు గడవదు . మిగిలిన కొన్ని యాప్స్ లా ఇది ఎంటర్ టైన్ మెంట్ కాదు . . . చివరకు ఆఫీసు పనుల కమ్యూనికేషన్ కూడా ఇప్పుడు చాలా వరకూ వాట్సప్ పైనే జరుగుతోంది . బంధువులు , స్నేహితులు , కొలీగ్స్ , ఆఫీసు వ్యవహారాలు అన్నింటికీ . . ఒక్కో గ్రూప్ . . అలా అందరినీ అలరిస్తున్న వాట్సప్ ఇప్పుడు మరింత అద్భుతంగా తన వినియోగదారులను అలరించబోతోంది . కొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది . అవేంటో చూద్దాం . . ఇప్పటి వరకూ ఒక ఫోన్ నంబరుతో ఒకే ఫోన్లో వాట్సప్ వాడే అవకాశముంది . అయితే ఇదే నంబరుతో మరో ఫోన్లో లాగిన్ అయ్యేందుకు కుదరదు . . మహా అయితే . . కేవలం వాట్సప్ వెబ్ లో మాత్రమే ఉపయోగించుకోవచ్చు . కానీ త్వరలో ఆ ఇబ్బంది తొలగిపోనుంది . ఇప్పుడు ఒకే నంబరుపై వేరు వేరు ఫోన్లలో ఒకే సారి వాట్సప్ వాడుకొనేలా మార్పు చేస్తున్నారు . ప్రస్తుతం దీని బీటా వెర్షన్ నడుస్తోంది . ముందుగా ఈ సౌకర్యం ఐఓఎస్లో అందుబాటులోకి తెస్తారట . ఆ తర్వాత ఆండ్రాయిడ్ ఓఎస్లో చేరుస్తారట . ఇక మరో సౌకర్యం . . గూగుల్ అసిస్టెంట్ నుంచి వాట్సప్ వాయిస్ కాల్స్ చేసుకోవడం .
ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం గూగుల్ అసిస్టెంట్ తెరిచి వాట్సప్ నుంచి వాయిస్ , వీడియో కాల్ చేసుకొనే సౌకర్యం త్వరలో రాబోతోందట . ఇక మరో అద్భుతమైన ఫీచర్ . . డెస్క్టాప్ లోనూ ఆల్బమ్ ఏర్పాటు చేసుకునే సౌకర్యం . . ఇప్పటి వరకూ ఎవరైనా కొన్ని ఫోటోలు , వీడియోలు పంపితే అవి ఛాట్ హిస్టరీలో ఒక ఆల్బమ్లా కనిపిస్తున్నాయి . ఈ ఫీచర్ ప్రస్తుతం డెస్క్టాప్లో లేదు . ఒక ఫోటో కింద మరో ఫోటో వరుసగా కనిపిస్తున్నాయి . వాట్సప్ వెబ్ లోనూ ఆల్బమ్ ఫీచర్ ను అందుబాటులోకి తేనున్నారు . దీంతో పాటు ఐఫోన్ వినియోగదారుల కోసం వాట్సప్ ఆడియో ప్లే బ్యాక్ ఫీచర్ కూడా అందుబాటులోకి రాబోతోంది . 

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :