Tuesday, September 3, 2019

బ్యాంకుల్లో మారిన అంశాలు ఇవే



Read also:

బ్యాంకుల్లో మారిన అంశాలు ఇవే

బ్యాంకులకు సంబంధించిన పలు నిబంధనలు సెప్టెంబర్ 1 నుంచి మారాయి. 
డిపాజిట్లు దగ్గరి నుంచి రుణాల వరకు కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి. 
వీటి గురించి ముందుగా తెలుసుకొని ఉంటే.. మీకు కొంత ప్రయోజనం కలగొచ్చు. 
మారిన అంశాలేంటంటే... Bank Timings: ప్రభుత్వ రంగ బ్యాంకుల టైమింగ్ మారే అవకాశముంది. 

దేశంలో సాధారణంగా బ్యాంకులు ఉదయం 10 గంటలకు ఓపెన్ అవుతాయి. ఇప్పుడు ఇప్పుడు బ్యాంకులు ఉదయం 9 గంటలకు తెరిచే అవకాశముంది.
ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే 9 గంటలకే బ్రాంచ్‌లను తెరవాలన్ని బ్యాంకులను ఆదేశించింది.
Kisan Credit Card : బ్యాంకులు రైతులకు సెప్టెంబర్ 1 నుంచి కిసాన్ క్రెడిట్ కార్డులను కేవలం 15 రోజుల్లోనే జారీ చేయనున్నాయి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దీనికి సంబంధించి బ్యాంకులను ఆదేశించింది.
SBI Home Loans: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) రెపో లింక్డ్ హోమల్ లోన్స్‌ను అందిస్తోంది. ఈ తరహా రుణాలు అందిస్తున్న తొలి దేశీ బ్యాంక్ ఇదే. సెప్టెంబర్ 1 నుంచి ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వడ్డీ రేటు 8.05 శాతం నుంచి ప్రారంభమౌతోంది.

SBI Fixed Deposit: ఎస్‌బీఐ కస్టమర్లకు బ్యాడ్ న్యూస్. బ్యాంక్ సెప్టెంబర్ 1 నుంచి రిటైల్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గించింది. సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లపై ఎలాంటి మార్పు లేదు.

*Auto, personal loan within 59 minutes: బ్యాంకులు హోమ్, ఆటో రుణాలను కేవలం 59 నిమిషాల్లోనే అందించనున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి చాలా బ్యాంకులు పీఎస్‌బీలోన్స్‌ఇన్59మినిట్స్ పోర్టల్‌ ద్వారా ఈ సేవలు అందించొచ్చు. ఓరియెంటల్ బ్యాంక్ ఈ సేవలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. 


Mobile wallet KYC: మొబైల్ వాలెట్ యూజర్లకు అలర్ట్.


పేటీఎం, ఫోన్‌పే వంటి వాలెట్ సేవలు ఉపయోగించాలంటే కేవైసీ పూర్తి చేసుకోవాలి. లేదంటే ఈ సేవలు పొందలేం. ఆగస్ట్ 31తోనే దీనికి గడువు పూర్తియ్యింది.

Repo Rate linked retail loans: బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర రెపో లింక్డ్ రిటైల్ రుణాలు ఆవిష్కరిస్తామని ప్రకటించింది. రిటైల్ రుణాలను ఆర్‌బీఐ రెపో రేటుతో అనుసంధానం చేస్తామని పేర్కొంది. ఈ నిర్ణయం సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి వచ్చింది

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :