More ...

Sunday, September 15, 2019

యురేనియం తవ్వకాలపై పోరాడుదాంRead also:

నల్లమల అడువులను కాపాడుకుందాం ఆకాశాన్ని తాకే తూర్పు కనుమలకు , ప్రకృతి రమణీయ దృశ్యాలకు , అరుదైన వృక్షజాతులకు , కనువిందు చేసే వణ్యప్రాణులకు నెలవు .తెలుగు రాష్ట్రాల అమెజాన్ గా పేరుగాంచిన నల్లమల అడవులు.అంతరించిపోనున్నాయా.మానవ మనుగడ ప్రశ్నార్థకం కానుందా.జీవ వైవిధ్యం దెబ్బతిని జీవ జాతులు | అంతరించిపోతున్నాయా మన నాగరికతకు మూలవాసులైన చెంచుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందా.భవిష్యత్తులో భయంకరమైన ప్రకృతి విధ్వంసం చోటు చేసుకోబోతుందా.ప్రస్తుతం నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాల గురించి వస్తున్న వార్తలు తెలుగు ప్రజల్లో భయాందోళన కలిగిస్తున్నాయి . 

యురేనియం తవ్వకాలకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో ప్రశాంతమైన నల్లమల అడవుల్లో తీవ్ర ఉద్రికత్త నెలకొంది . యురేనియం కొనగలుగుతాం కానీ . . అడవులను కొనగలుగుతామా అంటూ విజయ్ దేవరకొండ,సమంత వంటి సినీ స్టార్స్తో పాటు సామాజికవేత్తలు , పర్యావరణవేత్తలతో పాటు ఆదివాసీ ప్రజలు , ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . యురేనియం తవ్వకాల వల్ల భవిష్యత్తు తరాలు ప్రమాదంలో పడనున్నాయి . భయంకరమైన విధ్వంసం జరుగనుంది . జీవ వైధవ్యం దెబ్బతిని మానవ మనుగడే ప్రశ్నార్థం కానుంది . జీవజాతులు అంతరించిపోనున్నాయి.ఊహించుకుంటేనే భయమేస్తుంది కదా . . ఈ యురేనియం తవ్వకాల వల్ల ఎదురయ్యే దుష్పలితాల గురించి తెలుసుకునే 

ముందు నల్లమల అడవుల గురించి సమగ్రంగా తెలుసుకుందాం

తూర్పు కనుమలలో భాగంగా కృష్ణా , పెన్నా నదులకు మధ్యన , ఉత్తర - దక్షిణ దిశగా దాదాపు 150 కి . మీ . మేర ఈ దట్టమైన - నల్లమల అడవులు వ్యాపించి ఉన్నాయి . ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు , ప్రకాశం , గుంటూరు , కడప జిల్లాలలో తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో , నల్గొండ జిల్లాల కొద్ది మేర ఈ నల్లమల అడవులు విస్తరించి ఉన్నాయి . ఈ నల్లమల అటవీ ప్రాంతం విస్తరించి ఉన్న 9500 చదరపు అడగులలో సుమారు మూడవ వంతు అంటే 3728 కి . మీ . మేర దట్టమైన అటవీ ప్రాంతం ఉంది . పులులు సమృద్ధిగా ఉన్న ఈ దట్టమైన అటవీ ప్రాంతాన్ని రాజీవ్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్గా ప్రకటించారు . ఇక నల్లమల అడవుల్లో మారేడు , నేరేడు , ఉసిరి , కరక్కాయ , కుంకుడుకాయ , అశ్వగంధ , పిల్లితీగలు , నేలవాము , నేల ఉసిరి , గన్నేరు గడ్డలు వంటి అరుదైన మొక్కలు ఉన్నాయి . ఇక శ్రీగంధం , జిట్రేగి , తెల్లమద్ది , సండ్ర వంటి అరుదైన వృక్షాలు . . టేకు , మామిడి , సుబాబుల్ , మద్ది , వేప , ఎగిస , బండారు , చిరంజి , తపసి , నల్లమద్ది వంటి . . కలపజాతి వృక్షాలు , రావి , మర్రి , చింత , కానుగ , రేల , బూదగ , ముల్లెంజాతి వెదురు వంటి ఇతర రకాల వృక్షాలు విస్తరించి ఉన్నాయి . ఇక జంతుజాలం గురించి వస్తే . బెంగాల్ టైగర్ , చీతా , అడవి పందులు , దుప్పి , ఎలుగుబంటి  బెంగాల్ టైగర్ , చీతా , అడవి పందులు , దుప్పి , ఎలుగుబంటి , అడవి కుందేలు , నక్కలు , నీలగాయ్ , సాంబార్ డీర్ , చుక్కల జింక , మౌస్డీర్ , కొండ గొర్రె మొదలైన జింకలు , అడవి పిల్లులు , రాచ ఉడతలు , చారల హైనా , రాక్ పైథాన్ వంటి జంతువులు , 80 జాతులకు పైగా పక్షులు ఉన్నాయి . ఈ నల్లమల అడవుల్లో జనజీవనం చాలా తక్కువ . సుమారు 120 చెంచుపెంటల్లో 10 - 12 వేల మంది చెంచులు మనుగడ సాగిస్తున్నారు . ముఖ్యంగా నల్లమల అడవుల్లో అపారమైన ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి . క్వార్ జైట్ , సాండ్ స్టోన్ , యురేనియం , వజ్రాలు వంటి ఖనిజ నిక్షేపాల కోసం తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి . 

యురేనియం వల్ల ఎదురయ్యే దుష్పలితాలు  

యురేనియం అనేది ప్రకృతి సహజ సిద్ధంగా భూమిలో , నీటిలో లభించే అణుధార్మిక రసాయన మూలకం . ఈ మూలకానికి అణుభారం చాలా ఎక్కువ . ఏడు కిలోల యురేనియంతో ఒక  అణుబాంబును తయారు చేయవచ్చు . దీన్ని బట్టి యురేనియం శక్తిని మనం అర్థం చేసుకోవచ్చు . కాగా యురేనియంతో విద్యుత్తు ఉత్పత్తి చేయాలనే ఆలోచనలో కేంద్రం ఉంది . కానీ విద్యుత్ పేరుతో అణుబాంబుల తయారీకి యురేనియం తవ్వకాలు నను .అదే జరిగితే భవిష్యత్తులో భయంకర విధ్వంసం జరిగే అవకాశం ఉందనేది వాస్తవం . 

ఇటీవల తెలంగాణ ప్రాంత నల్లమల అడవిలోని , రాతి పొరల్లో అట్టడుగు భాగాన యురేనియం నిక్షేపాలు దాగి ఉన్నట్లు . . కనుగొన్న యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ త్రవ్వకాలకు సన్నద్ధమైంది . గతంలోనే కేంద్ర ప్రభుత్వం గుట్టు చప్పుడు కాకుండా . . యురేనియం ఖనిజాల కోసం రహస్య సర్వేలు ఎన్నో నిర్వహించింది .  ాజాగా తెలంగాణలో దేశంలోనే అతిపెద్దదిగా గుర్తించబడిన అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్టు పరిధిలో ఉన్న నాణ్యమైన యురేనియం నిక్షేపాల తవ్వకాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది . ఇక్కడ డీబీయస్ కంపెనీ వారు ఇప్పటికే 430 బోర్లు వేశారు . ఇంకా 4 వేల పై చిలుకు బోర్లు వేయడానికి సిద్ధపడుతున్నారు . ప్రజలకు అనుమానం వచ్చి బోర్ల వాహనాలను ధ్వంసం చేస్తే అప్పుడు అసలు విషయం బయటపడింది . దీంతో యు రేనియం తవ్వకాలపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతుంది . ఈ యురేనియం తవ్వకాలు ఫలితంగా పర్యావరణం దెబ్బతిని తెలంగాణ , ఆంధ్ర రాష్ట్రాల ప్రజలు ఆరోగ్య రీత్యా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది . 

ఈ యురేనియం తవ్వకాలతో నల్లమల అడవుల్లోని చెంచుల ఉనికి ప్రశ్నార్థం అవుతుందని , పరోక్షంగా 83కి . మీ పరిధిలోని గ్రామాలపై దుష్ప్రభావం ఉంటుందని పర్యావరణవేత్తలు అంటున్నారు . ఇక్కడి ఆధ్యాత్మిక క్షేత్రాలు పూర్తిగా తమ ప్రాముఖ్యతను కోల్పోనున్నాయి . ముఖ్యంగా యురేనియం తవ్వకాలు జరిగే ప్రదేశంలో వెలువడే అణుధార్మికత గాలిలో ప్రవేశించిన తర్వాత జీవుల శరీరాల్లోకి చేరి ఎముకల్లో స్థిరపడుతుంది . తద్వారా ఎముకల , ఊపిరితిత్తుల క్యాన్సరు , రకరకాల చర్మవ్యాధులు , జన్యుసంబంధమైన వ్యాధులు , ప్రబలే ప్రమాదం ఉంది . సుమారు 70 రకాల వన్యప్రాణులకు కూడా ముప్పు కలగనుంది . ఇక యురేనియం శుద్ధితో కృష్ణా జలాలు కలుషితమవుతాయని , శ్రీశైలం డ్యామ్ కు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . హైదరాబాద్ నగర ప్రజల భవిష్యత్తులో యురేనియంతో కలుషితమైన నీటిని తాగే ప్రమాదం ఏర్పడుతోంది .

ఇప్పటికే జార్కండ్ రాష్ట్రంలో యురేనియం తవ్వకాల వల్ల జరుగుతున్న దుష్పలితాలను చూస్తున్నాం . రేడియేషన్ ప్రభావంతో పిల్లలు వింత ఆకృతులతో జన్మిస్తున్నారు . అక్కడి ప్రజలంతా క్యాన్సర్ మహమ్మారికి బలైపోతున్నారు . భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి భయంకర పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది . మానవ మనుగడకు , ప్రకృతి విధ్వంసాలకు కారణమవుతున్న ఈ యురేనియం తవ్వకాలను వ్యతిరేకిద్దాం . . నాగరికతకు ఆనవాళ్లుగా మిగిలిన నల్లమల అడవులను కాపాడుకుందాం . . . నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు అనుమతి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ప్రజాసంఘాలు , సామాజికవేత్తలు , కవులు , కళాకారులు , ప్రజలంతా కలిసి . . చెంచుల పోరాటాలకు సంఘీభావం పలుకుదాం . నల్లమల అడవులపై సోషల్ మీడియాలో జరుగుతున్న క్యాంపెయిన్ కు స్పందించిన తెలంగాణ ఐటీ , పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ . . ఈ వి షయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళతానని ట్వీట్ చేశారు . తెలంగాణ ప్రభుత్వం కూడా నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై ఇంకా పూర్తి స్థాయిలో అనుమతులు ఇవ్వలేదని తెలుస్తోంది . ఏది ఏమైతేనేం మానవ మనుగడకు ప్రమాదకరమైన ఈ యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా సేవ్ నల్లమల . . సేవ్ ఎన్విరాన్ మెంట్ . . స్టాప్యురేనియంమైనింగ్ . . అంటూ పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేద్దాం . . కేంద్ర ప్రభుత్వం యురే ియం తవ్వకాలు నిలిపే వరకు పోరాడుదాం . . . తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ అమెజాన్ గా పేరుగాంచిన నల్లమల అడవులను కాపాడుకుందామని పబ్లిక్ వైబ్ పిలుపునిస్తోంది .

Janardhan Randhi

About Janardhan Randhi

Hi I am Janardhan Randhi,Professionally I am a Application developer but passionate on blogging.I spend a lot of time learning new techniques and actively help other people learn web development through a variety of help groups and writing web development tutorials.

Subscribe to this Blog via Email :