Friday, September 13, 2019

మీకు ఎస్‌బీఐ అక్కౌంట్ ఉందా? ఇకపై మినిమమ్ బ్యాలెన్స్ ఎంతో తెలుసా?



Read also:

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు వచ్చే నెల 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రభుత్వరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇకపై తమ బ్యాంకు ఖాతాల్లో ఉండాల్సిన కనీస నిల్వలపై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బ్యాంకు ఖాతాల్లో ఉంచాల్సిన మినిమమ్ అమౌంట్ మొత్తాన్ని తగ్గించింది.
ఎస్‌బీఐ తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం పట్టణ ప్రాంతాల్లో ని ఖాతాల్లో కనీసం రూ.3 వేలు ఉంచుకోవాలి. గతంలో ఇది రూ.5 వేలుగా ఉండేది. అదే విధంగా సెమీ అర్బన్ ప్రాంతాల్లో కనీసం రూ.2 వేలు ఉంచాలి. ఇక గ్రామీణ ప్రాంతాల్లోని ఖాతాదారులు కనీసం ఒక వెయ్యి రూపాయలు ఉంచుకోవాలని బ్యాంకు ప్రకటించింది.
నిబంధంనలు పాటించని ఖాతాదారులపై ఛార్జీల మోత మోగనుంది.
పట్టణ ప్రాంతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ రూ.1500 వరకు మాత్రమే ఉంటే అటువంటి ఖాతాలపై రూ.10, రూ.750 వరకు ఉంటే రూ.12.75, అంతకు తగ్గిపోతే రూ.15 రూపాయలు ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. వీటికి జీఎస్టీ అధనంగా చెల్లించాలి.

అయితే సేవింగ్స్ ఖాతాల్లో సొమ్ము డిపాజిట్ చేయాలనుకుంటే ఇకపై నెలకు మూడుసార్లు మాత్రమే డిపాజిట్ చేసేలా రూల్స్ మార్చారు. అది దాటితే అదనపు ఛార్జీలు వసూలు చేస్తారు. మూడుసార్లు లిమిట్ దాటిన తర్వాత నాలుగోసారి డిపాజిట్ చేసినా.. కనీసం రూ.100 రూపాయలు డిపాజిట్ చేసినా రూ.50 ఛార్జీలు వసూలు చేయనున్నారు. దీంతో పాటు జీఎస్టీ కూడా అదనంగా కట్టాల్సిందేనంటూ బ్యాంక్ ప్రకటించింది. అదే విధంగా హోం బ్రాంచి నుంచి కాకుండా వేరే బ్రాంచి నుంచి డిపాజిట్ చేయదల్చుకుంటే గరిష్టంగా రూ.2 లక్షల వరకు మాత్రమే అనుమతి ఇస్తారు. అదే విధంగా తమ ఎక్కౌంట్‌లో కనీసం రూ.25 వేలు బ్యాంకు బ్యాలెన్స్ ఉంచే వ్యక్తులు రెండు సార్లు ఉచితంగా నగదు ఉపసంహరణ చేసుకునే వీలు కల్పించారు. అదే విధంగా రూ.25 వేల నుంచి 50 వేల మధ్య బ్యాలెన్స్ ఉంచే ఖాతాదారులు నెలకు 10 సార్లు విత్ డ్రా చేసుకోవచ్చు. మినిమమ్ నెలకు రూ.1 లక్ష బ్యాలెన్స్ ఉంచే కస్టమర్లు ఎన్నిసార్లయినా విత్‌డ్రా చేసుకోవచ్చంటూ బ్యాంకు అధికారులు ప్రకటించారు.

అయితే హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ఏటీఎంల నుంచి నెలకు 10 సార్లు నగదును ఉపసంహరించుకోవచ్చు. నాన్ మెట్రో నగరాల్లో 12 సార్లు విత్ డ్రా చేసుకోవచ్చు. ఎప్పుడైనా చెక్ బౌన్స్ అయితే జీఎస్టీతో కలిపి రూ.168 ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. వీటన్నితో పాటు ఇతర బ్యాంకు కస్టమర్లు ఎస్‌బీఐ ఏటీఎంలలో నెలకు ఐదుసార్లు ఉచితంగా నగదు ఉపసంహరించుకోవచ్చు.

అయితే ఎస్‌బీఐ ఖాతాదారుల మినిమమ్ బ్యాలెన్స్‌కు సంబంధించి విడుదల చేసిన కొత్త రూల్స్‌పై మధ్యతరగతి కస్టమర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి నిబంధనలు అమల్లోకి తీసుకువచ్చి ఖాతాదారుల వద్దనుండి బ్యాంకులు ముక్కుపిండి వసూలు చేస్తున్నాయంటూ పెదవి విరుస్తున్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :