Tuesday, September 10, 2019

గృహ రుణాలపై తగ్గిన వడ్డీ రేట్లు



Read also:

గృహ రుణాలపై తగ్గిన వడ్డీ రేట్లు

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వం రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మరోసారి వడ్డీ రేట్లను తగ్గించింది. గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ గుడ్ న్యూస్ చెప్పిన ఎస్బీఐ.. హోం లోన్స్‌తో పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్లు (ఎఫ్‌డీల)పై వడ్డీ రేట్లను తగ్గించింది. దీనికి సంబంధించిన ప్రకటనను ఈ రోజు విడుదల చేసింది. గృహ గుణాలపై వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్ల మేర, కాలపరిమితి ముగిసిన అన్ని టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎస్బీఐ వడ్డీ రేట్లను తగ్గించడం ఇది ఐదో సారి కావడం విశేషం. కాగా, తగ్గించిన వడ్డీ రేట్లను సెప్టెంబర్ 10వ తేదీ నుంచి అమలు చేయనున్నట్టు ఎస్బీఐ ప్రకటించింది.
SBI
45 రోజుల్లో మెచూరిటీ పొందే ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు 4.5 శాతమే ఉండనుండగా.. 180 రోజుల నుంచి ఏడాది వరకు చేసిన ఎఫ్‌డీలపై 5.8 శాతం వడ్డీ రేట్లను ఇవ్వనుంది. ఇక, మూడేళ్ల వరకు కాలపరిమితో ఉండే ఎఫ్‌డీలపై 6.35 శాతం వడ్డీ ఇవ్వనుంది ఎస్బీఐ.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :