Tuesday, September 3, 2019

ఏపీలో ఆర్టీసీకార్మికులు ఇక ప్రభుత్వ ఉద్యోగులే



Read also:

ఏపీలో ఆర్టీసీకార్మికులు ఇక ప్రభుత్వ ఉద్యోగులే

ఆర్టీసీ కార్మికుల చిరకాల కోరిక నెరవేరిందన్న మంత్రి నాని  ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై ఏర్పాటుచేసిన అధ్యయన కమిటీ తన నివేదికను సీఎం జగన్‌కు అందజేసిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ఆర్టీసీని విలీనం చేయడం, లాభాల బాట పట్టించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ నివేదికలో పలు మార్గదర్శకాలు సూచించిందన్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే అంశానికి సీఎం జగన్‌ సూచనప్రాయంగా అంగీకారం తెలిపారని వెల్లడించారు. ఇకపై ఆర్టీసీ ఉద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగులేనని మంత్రి స్పష్టంచేశారు. మిగతా విధివిధానాలన్నీ త్వరలో ఖరారవుతాయన్నారు.
RTC
ఆర్టీసీ.. పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌గా మారనుందని చెప్పారు. ఇది ఉద్యోగుల్ని విలీనం చేసేందుకే ఏర్పడబోతుందన్నారు.

ఆర్టీసీ కార్మికుల వేతనాల రూపంలో ప్రభుత్వంపై రూ.3500 కోట్ల భారం పడుతుందని మంత్రి చెప్పారు. ఆర్టీసీని లాభాల బాట పట్టించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటామన్నారు. దేశంలోనే చాలా అంశాల్లో ఏపీఎస్‌ఆర్టీసీ ముందుందన్నారు. ఆర్టీసీ విలీన కమిటీ నివేదిక రేపు కేబినెట్‌ ముందుకు వస్తుందని చెప్పారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీన నివేదికపై మంత్రివర్గంలో చర్చించి విలీనానికి ఆమోద ముద్ర వేయనున్నట్టు మంత్రి తెలిపారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :