Monday, September 2, 2019

ఇక నుంచి కరెంటు పోతే , మీ చేతికి డబ్బులు



Read also:

ఇక నుంచి కరెంటు పోతే , మీ చేతికి డబ్బులు గ్రామాలలో ఎడాపెడా కరెంట్ కోతలు విధిస్తుంటారు . వేసవిలో అయితే ఒకోసారి ఎప్పుడు కరెంటు వస్తుందో , ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొని ఉంటుంది , ఇక వర్షాకాలంలో కూడా ఈదురు గాలుల దెబ్బకు కరెంటు పోతే ఒక్కోసారి 24 గంటలు రాని సంఘటనలు ఎన్నో ఉన్నాయి . అందులో భాగంగా ఒక్కోసారి ప్రమాదాలను అరికట్టేందుకు ముందుగానే విద్యుత్ శాఖ కరెంటు ను నిలిపివేసి ఈదురు గాలులతో కూడిన వర్షం తగ్గిన తరువాత కరెంటు పునరుద్ధరిస్తారు . 
కానీ ఇక నుంచి అలా వారికి ఇష్టమైనప్పుడు కరెంటు తీసివేయడానికి కుదరదని తెలుస్తుంది . త్వరలో కేంద్రం తీసుకోబోయే సంచలనాత్మకమైన నిర్ణయంతో ముందస్తు సమాచారం లేకుండా కరెంటు తీసివేస్తే విద్యుత్ సంస్థలకు బారి జరిమాన వేయనున్నారట . ఈ డబ్బును నేరుగా వినియోగదారుడి ఖాతాకే జమ చేయనున్నారట . ఎప్పుడు పడితే అప్పుడు పవర్ కట్స్ తో వినియోగదారుడిని ఇబ్బంది కలిగించకుండా ఉండటానికి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది . కాకపోతే విపత్తులు , సాంకేతిక సమస్యలు వచ్చిన సమయంలో ముందస్తు సమాచారంతో విద్యుత్ నిలిపివేస్తే జరిమానా ఉండదని తెలుస్తుంది . కేంద్రం తీసుకున్న నిర్ణయంతో భారతదేశంలో ఒక పటిష్టమైన ప్రణాళికతో ప్రతి ఇంటిలో దీపం వెలగటమే కాకుండా ఎలాంటి ఇబ్బందులకు వినియోగదారుడు ఎదుర్కోకుండా తీసుకోవాలని నిర్ణయించడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు 

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :