Sunday, September 15, 2019

రైల్వేస్టేషన్ లో కొత్త రూల్ 5 నిమిషాలు దాటితే వెయ్యి రూపాయలు ఫైన్



Read also:

రైల్వే స్టేషన్లలో కార్ల పార్కింగ్ పెద్ద సమస్యగా మారింది. వాహనదారులు పార్కింగ్ ప్లేస్ లో కాకుండా ఎక్కడపడితే అక్కడ కార్లు పార్క్ చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీనికి చెక్ పెట్టేందుకు రైల్వే అధికారులు కొత్త రూల్ తెచ్చారు. రూల్స్ బ్రేక్ చేసిన వారిని తాట తీస్తారు. ఫైన్లు వేసి జేబులు గుల్ల చేస్తారు. రైల్వే స్టేషన్ కి వెళ్లే వారు కారుని పార్కింగ్ స్థలంలో కాకుండా స్టేషన్ ఎంట్రన్స్ లో, దాని చుట్టుపక్కల పెడితే.. నాలుగైదు నిమిషాల్లో తమ వాహనాన్ని తీసేయాలి. 5 నిమిషాలకు మించి ఒక్క క్షణం ఆలస్యమైనా ఫైన్ తప్పదు. ఆలస్యాన్ని బట్టి కనీసం రూ.100 నుంచి వెయ్యి రూపాయల వరకు జరిమానా విధించాలని రైల్వే శాఖ నిర్ణయించింది.
రద్దీ ఎక్కువగా ఉండే ప్రధాన స్టేషన్లలో దశలవారీగా ఈ రూల్ ని అమలు చేయనున్నారు. త్వరలో సికింద్రాబాద్ స్టేషన్ లో బోయిగూడ వైపు ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. స్టేషన్ లోపలికి వచ్చే వాహనాలను గుర్తించేందుకు సికింద్రాబాద్ స్టేషన్ లో సీసీ కెమెరాలతో పాటు ఓ ప్రత్యేక బూత్ ఏర్పాటు చేశారు. స్టేషన్ కు వచ్చే ప్రతి వాహనం వివరాలను నమోదు చేస్తారు. వచ్చిన సమయం తెలుపుతూ రిసిప్ట్ ఇస్తారు. తిరుగు ప్రయాణంలో ఆ రిసిప్ట్ ని వాహనదారుడు బూత్ లో ఇవ్వాలి. 5 నిమిషాలు దాటితే సమయాన్ని బట్టి ఫైన్ వేస్తారు. ఒక వేళ రసీదు పోయినా రూ.500 కట్టాల్సిందే. పార్కింగ్ స్థలంలో కాకుండా స్టేషన్ పరిసరాల్లో వాహనాలను చాలాసేపు నిలిపి ఉంచడంతో ట్రాఫిక్ తో పాటు ఇతర సమస్యలు వస్తున్నాయని రైల్వే శాఖ అధికారులు చెప్పారు. ఈ సమస్యని పరిష్కరించేందుకు జరిమానాలు వెయ్యక తప్పడం లేదన్నారు. మంచి ఫైన్ వేస్తే కానీ  దారికి రారని అంటున్నారు. కాగా ఈ రూల్ పై వాహనదారులు సీరియస్ అవుతున్నారు. జనాలను దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని మండిపడుతున్నారు. అయిన దానికి కాని దానికి ఫైన్లు వేసి దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :