Tuesday, September 17, 2019

PF interest rate increment to 8.65%



Read also:

ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్. మీ పీఎఫ్ అకౌంట్లలో వడ్డీ పెరిగింది. ఎంప్లాయిస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గానైజేషన్ (EPFO) తమ ఖాతాదారుల అకౌంట్లలో వడ్డీని పెంచడం ప్రారంభించింది. దీపావళి పండగకు ముందుగానే 2018-2019 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చాలామంది పీఎఫ్ అకౌంట్ దారులకు 8.65 శాతం వరకు వడ్డీ క్రెడిట్ అయింది.

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్‌) చందాదారులు 2018-19 సంవత్సరానికి గాను ప్రస్తుతమున్న 8.55 శాతం వడ్డీకి బదులు 8.65 శాతాన్ని పొందనున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ తెలిపారు. ఆరు కోట్లకు పైగా చందాదారులకు మేలు కలిగించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. దిల్లీలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ గంగ్వార్‌ ఈ విషయం తెలిపారు.

కార్మిక, ఆర్థిక మంత్రిత్వ శాఖల మధ్య వడ్డీరేటుపై ఉన్న భిన్నాభిప్రాయాలను తొలగించుకొనేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో జరిపిన చర్చల్లో.. 8.65 శాతం వడ్డీ రేటు చెల్లించినా సంస్థ వద్ద సరిపడా మిగులు ఉందని వివరించిన అనంతరం పెంపుదలకు మార్గం సుగమమైనట్టు ఒక అధికారి తెలిపారు.ఆర్థిక శాఖ జనరల్ ప్రావిడెంట్ ఫండ్(GPF) తదితర నిధులపై గతంలో 8.0 శాతంగా ఉన్న వడ్డీ రేటును సెప్టెంబర్ 30 నాటికి 7.99 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే.

ఇటీవలే ప్రభుత్వం ఉద్యోగుల భవిష్య నిధిపై వడ్డీ రేటును పెంపునకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ పెంపుతో 6 కోట్ల మంది ఈపీఎఫ్ఓ సబ్ స్రైబర్లకు ప్రయోజనం చేకూరింది. పీఎఫ్/ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలో తెలుసా? సాధారణంగా.. UMANG యాప్, SMS, EPF పోర్టల్ లేదా Missed Call ద్వారా ఈజీగా మీ పీఎఫ్ అకౌంట్లలో బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేసుకోవచ్చు.

Follow the below steps to get your PF Amount

1. SMS : PF బ్యాలెన్స్ చెకింగ్

* ఎస్ఎంఎస్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.
* మీ రిజిస్ట్రర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 7738299899కు SMS చేయాలి.
* మీరు పంపే మెసేజ్ EPFOHO UAN (విత్ స్పేస్) ఇలా టైప్ చేసి SMS పంపాలి.
* మీ UAN అకౌంట్ మీ KYC వివరాలకు లింక్ అయి ఉండాలి.
* యూనైటెడ్ పోర్టల్ పై రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ నుంచి మాత్రమే SMS పంపాలి.

2. Umang App : (Play Store/ iOS)

* మీ పీఎఫ్ అకౌంట్లో పెరిగిన వడ్డీని UMANG యాప్ ద్వారా సులభంగా చెక్ చేసుకోవచ్చు.
* UMANG App Download చేసుకోవాలి.
* ఆండ్రాయిడ్ యూజర్లు Play Store నుంచి UMANG యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి.
* ఐఫోన్ (iOS) యూజర్లు.. iOS స్టోర్ నుంచి UMANG యాప్ డౌన్ లోడ్ చేసుకోండి.
* మీ EPF UAN అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి.
* మీ UAN రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు OTP వస్తుంది.
* OTP ఎంటర్ చేస్తే చాలు.. మీ PF బ్యాలెన్స్ కు సంబంధించి వివరాలన్నీ చెక్ చేసుకోవచ్చు.

3. EPF పోర్టల్ ద్వారా బ్యాలెన్స్ చెకింగ్ 

* www.epfindia.gov.in వెబ్ సైట్ విజిట్ చేయండి.
* Our Services కింద For Employees ఆప్షన్ పై Click చేయండి.
* ఇక్కడ Member Passbook అనే బటన్ పై క్లిక్ చేయండి.
* మీ UAN User Name, Passwordsతో Login కావాల్సి ఉంటుంది.
* UAN అకౌంట్ తో లింక్ అయిన అన్ని Member IDలు కనిపిస్తాయి.
* మెంబర్ ఐడీ (PF No) EPF అకౌంట్ Select చేసుకోండి.
* EPF పాస్‌బుక్ స్ర్కీన్ ఓపెన్ చేయగానే బ్యాలెన్స్ కనిపిస్తుంది.

4. Missed Call ద్వారా బ్యాలెన్స్ చెకింగ్ 

* రిజిస్టర్ మొబైల్ నుంచి 011-22901406కు మిస్స్డ్ కాల్ ఇవ్వండి.
* మీ మొబైల్ నెంబర్ UAN అకౌంటుతో లింక్ తప్పనిసరిగా ఉండాలి.
* UAN యాక్టివేట్ అయి ఉండాలి. KYC వివరాలు కూడా కంప్లీట్ అయి ఉండాలి.
* మిస్సడ్ కాల్ ఇవ్వగానే.. రెండు రింగులు వచ్చి ఆటోమాటిక్ గా కాల్ కట్ అవుతుంది.
* ఈ కాల్ కు ఎలాంటి చార్జీ ఉండదు.
* కాల్ కట్ కాగానే.. మీ మొబైల్ కు SMS రూపంలో PF బ్యాలెన్స్ వివరాలు వస్తాయి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :