Thursday, September 5, 2019

బ్యాంకుల విలీనం.ఖాతాదారులు ముందుగా చేయాల్సిన పనులు ఇవే



Read also:

బ్యాంకుల విలీనం.ఖాతాదారులు ముందుగా చేయాల్సిన పనులు ఇవే

4గా మారిపోతున్నాయి. వీటిల్లో మీరు అకౌంట్ కలిగిన బ్యాంక్ కూడా ఉందా? అయితే మీరు కొన్ని విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి.

ప్రధానాంశాలు:
  • బ్యాంకుల విలీనమైతే ఖాతాదారులపై ప్రభావం
  • పాస్‌బుక్స్ మార్చుకోవాలి
  • ఐఎస్ఎఫ్‌సీ కోడ్స్ కూడా మారతాయి
  • వడ్డీ రేట్లు, రుణ రేట్లను సవరిస్తారు
  • కేంద్ర ప్రభుత్వం భారీ సంస్కరణలకు తెరతీసింది. 
  • మెగా విలీన ప్రక్రియను ప్రకటించింది. 
  • పది ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగు బ్యాంకులుగా మార్చబోతోంది. 
  • దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 27 నుంచి 12కు దిగిరానుంది.
  • ఇండియన్ బ్యాంక్‌ను అలహబాద్ బ్యాంక్‌‌తో విలీనం చేయనున్నారు. 
  • దీంతో 7వ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ ఆవిర్భవిస్తుంది.
  •  పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ), ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ), యునైటెడ్ బ్యాంకులు కలిసిపోనున్నాయి. 
  • పీఎన్‌‌బీ ఈ బ్యాంకుల కార్యకలాపాలు చూసుకుంటుంది. తొలిగా విలీనం అయ్యే బ్యాంకులు ఇవే.
  • యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌లు వీలినం అవుతాయి. 
  • దీంతో 5వ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆవిర్భవిస్తుంది.
  • కెనరా బ్యాంక్, సిండికేట్ బ్యాంకులను వీలీనం చేస్తారు. దీంతో 4వ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఏర్పడుతుంది.
బ్యాంకుల విలీనం నేపథ్యంలో ఖాతాదారుల మదిలో కొన్ని ప్రశ్నలు తలెత్తొచ్చు. వాటికి సమాధానాలు తెలుసుకుందాం?

బ్యాంకులు విలీనమైతే బ్యాంక్ అకౌంట్లకు ఏమౌతుంది?
విలీనం తర్వాత సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్, కరెంట్ అకౌంట్స్, ఇతర అకౌంట్లపై ప్రభావం పడుతుంది. అకౌంట్ కలిగినవారు కొత్త పాస్‌బుక్ తీసుకోవాలి.

చెక్‌బుక్‌ల పరిస్థితి ఏంటి?
బ్యాంక్ అకౌంట్స్ అప్‌గ్రేడ్‌తో చెక్ బుక్స్ కూడా మార్చుకోవాలి. 

విలీనమైన బ్యాంకులన్నీ ఒకే రకమైన ప్రొడక్టులను కలిగి ఉండాలా? లేకపోతే ప్రస్తుత బ్రాండ్ నేమ్‌తోనే కొనసాగాలా? 
అనే అంశం బ్యాంకులను లీడ్ చేసే బ్యాంకుకే ఉంటుంది.

బ్యాంకులు విలీనమైతే బ్యాంక్ అకౌంట్లకు ఏమౌతుంది?
విలీనం తర్వాత సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్, కరెంట్ అకౌంట్స్, ఇతర అకౌంట్లపై ప్రభావం పడుతుంది. అకౌంట్ కలిగినవారు కొత్త పాస్‌బుక్ తీసుకోవాలి.

చెక్‌బుక్‌ల పరిస్థితి ఏంటి?
బ్యాంక్ అకౌంట్స్ అప్‌గ్రేడ్‌తో చెక్ బుక్స్ కూడా మార్చుకోవాలి. 

విలీనమైన బ్యాంకులన్నీ ఒకే రకమైన ప్రొడక్టులను కలిగి ఉండాలా? లేకపోతే ప్రస్తుత బ్రాండ్ నేమ్‌తోనే కొనసాగాలా? 
అనే అంశం బ్యాంకులను లీడ్ చేసే బ్యాంకుకే ఉంటుంది.

బ్యాంక్ విలీనం తర్వాత ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ మారుతుందా?
విలీనమయ్యే బ్యాంకులకు చెందిన పలు బ్రాంచుల ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్ (ఐఎఫ్ఎఫ్‌సీ) మారే అవకాశముంది. వెంటనే మార్పులు అయితే కనిపించవు. విలీనం తర్వాత మార్పులు ఉండొచ్చు.

క్రెడిట్, డెబిట్ కార్డులపై బ్యాంకుల విలీన ప్రభావమెంతా?
ఇప్పటికే జారీ అయిన క్రెడిట్, డెబిట్ కార్డులపై ఎలాంటి ప్రభావం ఉండవకపోవచ్చు. అయితే కొత్తగా వచ్చే కార్డులపై మాత్రం యూనిఫైడ్ బ్యాంక్స్ బ్రాండింగ్ ఉంటుంది.

ఎఫ్‌డీ, ఆర్‌డీలపై విలీనం ఎఫెక్ట్ ఉంటుందా?
ఫిక్స్‌డ్ డిపాజిట్లు (ఎఫ్‌డీ), రికవరింగ్ డిపాజిట్ (ఆర్‌డీ)లపై వెంటనే ప్రభావం ఉండదు. అయితే విలీనం తర్వాత అన్ని బ్యాంకుల ఎఫ్‌డీలు, ఆర్‌డీల వడ్డీ రేట్లను హేతుబద్దీకరిస్తారు.

లోన్ రేట్ల సంగతేంటి?
హోమ్ లోన్స్, వెహికల్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్, పర్సనల్ లోన్, గోల్డ్ లోన్స్ వంటి పలు రుణ ప్రొడక్టులపై ప్రభావం ఉంటుంది. విలీనం పూర్తి అయిన తర్వాత రేట్లను సవరిస్తారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :