Thursday, September 12, 2019

ల్యాండర్తో సంబంధాలు పునరుద్ధరించడానికి ఇస్రోకు మరో 10 రోజులు మాత్రమే



Read also:

విక్రమ్ ల్యాండర్ తో కాంటాక్ట్ కోసం ఇస్రో ప్రయత్నాలు కొనసాగుతున్నాయి . నాలుగు రోజులుగా ట్రై చేస్తు న్నప్పటికీ కమ్యూనికేషన్ కుదరడం లేదు . ల్యాండర్ తో సంబంధాలు పునరుద్ధరించడానికి ఇస్రోకు మరో 10 రోజులు మాత్రమే సమయం ఉంది . సెప్టెంబర్ 21 తర్వాత ల్యాండర్ తో కమ్యూనికేషన్ చేయడం కుదరదు . ఎందుకంటే , చంద్రునిపై ఒక లూనార్ డే టైమ్ మాత్రమే పని చేసేలా ల్యాండర్ ను రూపొందించారు . ఒక లూనార్ డే అంటే 14 రోజులు . విక్రమ్ ను చంద్రుడిపై ల్యాండ్ చేయడానికి ప్రయత్నించిన రోజు సెప్టెంబర్ 7 . లూనార్ డే సెప్టెంబర్ 21న ముగుస్తుంది . సెప్టెంబర్ 22 నుంచి లూనార్ నైట్ మొదలవుతుంది . 
Chandrayaan-2
చంద్రుడిపై రాత్రి సమయం అతి శీతలంగా ఉంటుంది . ఉష్ణోగ్రతలు మైనస్ 2 వేల డిగ్రీ సెల్సియసకు పడిపోతాయి . అలాంటి వాతావరణాన్ని తట్టుకోవడం ల్యాండర్ వల్ల కాదు . లూనార్ నైట్ ముగిసి మరో లూనార్ డే వచ్చిన తర్వాత కూడా ల్యాండర్ పని చేయలేదు . అందువల్ల సెప్టెంబర్ 21 ఇస్రోకు డెడ్ లైన్ . ఆలోపు కమ్యూనికేషన్ జరిగితే అద్భుతం జరిగినట్లే . చంద్రయాన్ - 2 ప్రాజెక్టులో భాగంగా గత శనివారం విక్రమ్ ల్యాండర్ ను ప్రయోగించారు . చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండవుతుండగా చివరి క్షణంలో ల్యాండర్ తో కమ్యూనికేషన్ తెగిపోయింది . దాంతో విక్రమ్ ఆచూకీ గల్లంతైంది . ఐతే , ఆర్బిటర్ సాయంతో ల్యాండర్ జాడను గుర్తించారు . చంద్రుడి సౌత్ పోల్ పై సాఫ్ట్ లాండింగ్ కావాల్సిన ల్యాండర్ , హార్డ్ లాండింగ్ ఐనట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు . ల్యాండ్ కావాల్సిన ప్రాంతానికి 500 మీటర్ల దూరంలో విక్రమ్ పడి ఉన్నట్లు కనుగొన్నారు . ల్యాండర్ ముక్కలు ముక్కలు కాలేదని , ఒకే భాగంగా ఉందని వెల్లడించారు . ల్యాండర్ పక్కకు ఒరిగిందే తప్ప చెక్కుచెదరలేదని చెప్పారు . ఐతే ల్యాండర్లో కమ్యూనికేషన్ సిస్టమ్ పని చేయడంపైనే దానితో సంబంధాల పునరుద్దరణ ఆధారపడి ఉందని ఇస్రో వర్గాలు చెబుతున్నాయి .

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :