Monday, September 2, 2019

10 రోజుల్లో ప్రధాని మోదీ సంచలన ప్రకటన



Read also:

10 రోజుల్లో ప్రధాని మోదీ సంచలన ప్రకటన . . . స్టూడెంట్స్ బీ రెడీ . . . 2020 నాటికి భారతదేశంలో సింగిల్ యూజ్ ( ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులు ) ప్లాస్టిక్ వస్తువుల్ని పూర్తిగా నిషేధిద్దామని ప్రధాని నరేంద్ర మోదీ . . . ఆగస్ట్ 15న టార్గెట్ ఫిక్స్ చేశారు . అక్టోబర్ 2న గాంధీ 150వ జయంతి నుంచీ ఈ నిర్ణయం అమల్లోకి . వస్తుందనే సంకేతాలిచ్చారు . అప్పటికల్లా . . . 10 వేల టన్నుల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఐటెమ్స్న సేకరించాలని కేంద్రం టార్గెట్ గా పెట్టుకుంది . ఇందుకు సంబంధించి . . . ఇటీవల కేంద్రంలోని అన్ని శాఖలతో తాగునీరు , పారిశుధ్య శాఖ . . . అంతర్గత సమావేశం నిర్వహించింది . అన్ని ప్రభుత్వ శాఖలు , విభాగాలూ . 
సెప్టెంబర్ 11 నుంచీ దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధంపై ప్రచారం చెయ్యాలని ఆదేశాలు జారీ అయ్యాయి . ఇందుకు సంబంధించి సెప్టెంబర్ 11న ప్రధాని మోదీ కీలక ప్రకటన చేస్తారని తెలిసింది . ఆ తేదీ నుంచీ ప్రభుత్వ శాఖలు . . . మొత్తం 10 వేల టన్నుల ప్లాస్టిక్ ను పోగేసి . . . దాన్ని రీసైక్లింగ్ చేసి . . . రోడ్లు , భవన నిర్మాణాల్లో ఉపయోగించాలని కేంద్రం నిర్ణయించింది . టార్గెట్ చేరుకునేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారులు . . . సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకుండా ప్రజల్లో అవగాహన కల్పించాల్సి ఉంది . వాటర్ బాటిల్స్ వాడకుండా , మిల్క్ ప్యాకెట్ల బదులు ప్రత్యామ్నాయం వాడేలా , ప్లాస్టిక్ బ్యాగుల బదులు , నార సంచులు వాడేలా . . . అన్ని స్టోర్లూ వాటినే వాడేలా . . . అవగాహన కల్పించాల్సి ఉంది . సెప్టెంబర్ 11 నుంచి అన్ని విద్యా సంస్థలూ . . . సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తో వస్తువుల ప్యాకింగ్ , అమ్మకం వంటివి చెయ్యరాదనే ఆదేశాలు జారీ కానున్నాయి . అలాగే UGC , CBSE కూడా . . . అన్ని కాలేజీలు , స్కూళ్లకు సెప్టెంబర్ 11న సర్క్యులర్లు జారీ చేస్తాయని తెలిసింది . అక్టోబర్ 2 నుంచీ వాటిలో ఎక్కడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అన్నదే లేకుండా చేయబోతున్నాయని సమాచారం . దేశంలో ఏటా కోటి 30 లక్షల టన్నుల ప్లాస్టిక్ వస్తువుల్ని ఉపయోగిస్తున్నారు . అలాగే . . . 90లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పోగవుతున్నాయి . అక్టోబర్ 2 నుంచీ దేశవ్యాప్తంగా సింగిల్ ప్లాస్టిక్ వస్తువుల వాడకం నిలిచిపోనుంది . మొదటి ఆరు నెలలూ ప్రయోగాత్మకంగా ఈ నిర్ణయం అమలు కానుంది . ఆ తర్వాత కఠినంగా అమలు చేయనుంది కేంద్ర ప్రభుత్వం .

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :