Monday, September 2, 2019

నెట్ బ్యాంకింగ్ ఖాతాదారులకు ఐసీఐసీఐ బ్యాంకు హెచ్చరిక



Read also:

నెట్ బ్యాంకింగ్ ఖాతాదారులకు ఐసీఐసీఐ బ్యాంకు హెచ్చరిక  నెట్ బ్యాంకింగ్ ఖాతాదారులకు ఐసీఐసీఐ బ్యాంకు తాజాగా హెచ్చరికలు జారీ చేసింది . ఇటీవల యూపీఐకి సంబంధించిన మోసాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ఐసిఐసిఐ బ్యాంక్ ఆన్ లైన్ బ్యాంకింగ్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది . యూపీఐ యాప్లను ఉపయోగించి గూగుల్ పే , పేటీఎం , ఫోన్ పే వంటి యూపీఐ ఆధారిత చెల్లింపులు చేసే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఐసీఐసీఐ వెల్లడించింది . మీకు బ్యాంకు కస్టమర్ కేర్ పేరిట బోగస్ కాల్స్ చేసి డెబిట్ , క్రెడిట్ కార్డుల వివరాలు , బ్యాంకింగ్ వివరాలు అడిగితే అలాంటి కాల్స్ ను డిస్ కనెక్ట్ చేయాలని బ్యాంకు కోరింది . యూపీఐ ఖాతాను మీరు స్వయంగా సెటప్ చేసుకోవాలని , దీనికోసం వేరొకరి సహాయం తీసుకోవద్దని బ్యాంకు అధికారులు సూచించారు . మీకు వచ్చే ఓటీపీ లేదా పిన్ , ఎస్ఎంఎస్ లను ఎప్పుడూ ఫార్వార్డ్ చేయవద్దని ఐసీఐసీఐ బ్యాంకు అధికారులు హెచ్చరించారు .

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :