Saturday, September 14, 2019

బంపర్ ఆఫర్.హెల్మెట్ ఉంటే నో చెకింగ్



Read also:

రోడ్డుపై వాహనదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న పోలీసు ఉన్నతాధికారులు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించారు. హెల్మెట్ ధరించి వాహనం నడుపుతున్న వాహన చోదకులకు మాత్రమే ఈ బంపర్ ఆఫర్ అని అంటున్నారు. హెల్మెట్ ధరించి ప్రయాణిస్తున్న వాహనచోదకులను ఇతర పత్రాల కోసం ఆపి తనిఖీ చేయవద్దని పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ట్రాఫిక్ పోలీసులకు ఆదేశించారు. హెల్మెట్‌ ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకుని, హెల్మెట్ వాడకాన్ని మరింత పెంపొందించడానికి కృషి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.
ఈ క్రమంలో హెల్మెట్ ధరించిన వాహన చోదకులకు తదుపరి ఆదేశాల వరకు తనిఖీల నుంచి కొంతకాలం మినహాయింపు ఇవ్వాలని ట్రాఫిక్ పోలీసులకు సూచించారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :