Monday, September 2, 2019

చంద్రయాన్ - 2.ఆర్బిటార్ నుంచి విడివడిన ల్యాండర్



Read also:

చంద్రయాన్ - 2 . . ఆర్బిటార్ నుంచి విడివడిన ల్యాండర్ హైదరాబాద్ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ( ఇస్రో ) ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ - 2 అత్యంత కీలకఘట్టాన్ని సోమవారం పూర్తి చేసుకుంది . చంద్రయాన్ - 2 ఆర్బిటార్ నుంచి విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా విడివడింది . సోమవారం మధ్యాహ్నం 1 : 15 గంటలకు ఆర్బిటార్ నుంచి ల్యాండర్ విడివడినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు . మొత్తానికి ఈ ప్రక్రియ విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు . ఈ నెల 7వ తేదీన చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ దిగనుంది . జులై 22న శ్రీహరికోట నుంచి చంద్రయాన్ - 2 నింగిలోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే . కొద్ది రోజులు భూకక్ష్యలో తిరిగి ఆగస్టు 20న చంద్రుడి కక్ష్యలో చేరింది చంద్రయాన్ - 2 . 
ఆ తర్వాత కక్ష్య తగ్గింపు ప్రక్రియను ఐదు సార్లు సమర్థవంతంగా చేపట్టింది ఇస్రో . ఆదివారం చివరి కక్ష్య కుదింపు ప్రక్రియను విజయవంతంగా చేపట్టినట్టు ఇస్రో వెల్లడించింది . ఆదివారం సాయంత్రం 06 . 21 గంటలకు ఐదోసారి ( ఆఖరి ) కక్ష్య కుదింపు ప్రక్రియను విజయవంతంగా చేపట్టింది . 52 సెకన్లపాటు ప్రొపల్షన్ సిస్టమ్ ను మండించి 119 కి . మీ . X 127 కి . మీ . కక్ష్యలోకి చంద్రయాన్ - 2ను విజయవంతంగా చేర్చాం అని ఇస్రో తెలిపింది . బుధవారం 6 . 5 సెకన్ల పాటు కక్ష్య కుదింపు చర్యలు చేపట్టి ల్యాండర్ విక్రమ్ ను చంద్రునిపై దిగబెట్టే ప్రక్రియను శాస్త్రవేత్తలు నెమ్మదిగా ప్రారంభిస్తారు . 35 కి . మీ . X 97 కి . మీ . కక్యలో ఉన్న ల్యాండర్ ను శనివారం వేకువజామున  01 . 30 నుంచి 02 . 30 గంటల మధ్య చంద్రుని ఉపరితలంపై నెమ్మదిగా దిగేలా చేస్తారు . ఇది జరిగిన నాలుగు గంటలకు రోవర్ ప్రజ్ఞ నెమ్మదిగా చంద్రుడి ఉపరితలంపై సంచరించడం ప్రారంభిస్తుంది . 

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :