Wednesday, September 25, 2019

Bank customers can no longer draw with Rs 1000



Read also:

బ్యాంకు కస్టమర్లు.ఇక రూ.వెయ్యికి మించి విత్ డ్రా చేయలేరు

బ్యాంకు కస్టమర్లకు బ్యాడ్ న్యూస్. మీ బ్యాంకు అకౌంట్లో డబ్బులను రూ. వెయ్యికి మించి విత్ డ్రా చేసుకోలేరు. ఈ మేరకు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. సేవింగ్స్ అకౌంట్ లేదా కరెంట్ అకౌంట్ కలిగిన కస్టమర్లు తమ అకౌంట్లలోని నగదును మరో ఆరు నెలల పాటు వెయ్యి కంటే ఎక్కువ మొత్తంలో విత్ డ్రా చేసుకోవడం కుదరదు. ఆర్టికల్ 35A బ్యాంకు రెగ్యులేషన్స్ కింద ఆర్బీఐ ఈ ఆంక్షలు విధించింది. పంజాబ్, మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకు కస్టమర్లకు మాత్రమే ఈ ఆంక్షలు వర్తిస్తాయి.
Banks
పంజాబ్, మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకు నుంచి మరో 6 నెలల వరకు ఆర్బీఐ నుంచి రాతపూర్వకంగా ఆమోదం లేకుండా పాత లోన్లను పునరుద్ధరించడం లేదా కొత్త లోన్లు, అడ్వాన్స్ లోన్లు ఇచ్చేందుకు అనుమతి లేదు.అదే సమయంలో బ్యాంకు ఏదైనా పెట్టుబడులు పెట్టడం లేదా తాజా డిపాజిట్లను అంగీకరించడం లేదా నిధులను రుణంగా ఇచ్చే అర్హత ఉండదు.

ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో పంజాబ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకు నికర ఆదాయం రూ.100 కోట్ల వరకు ఉన్నప్పటికీ ఆర్బీఐ ఆంక్షలు విధించింది. బ్యాంకు అర్థిక రిపోర్టు ప్రకారం.. ఆర్థిక సంవత్సరం 2018లో బ్యాంకులో రూ.42 కోట్లు ఉండగా.. FY 19లో రూ.88 కోట్లకు పెరిగింది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :