Friday, September 20, 2019

మిగిలిపోనున్న పోస్టులు-సచివాలయ ఉద్యోగాల్లోని 6 విభాగాల్లో ఇదే పరిస్థితి



Read also:

మిగిలిపోనున్న పోస్టులు-సచివాలయ ఉద్యోగాల్లోని 6 విభాగాల్లో ఇదే పరిస్థితి

7,723 పశుసంవర్థక సహాయకుల పోస్టులు మిగులు సచివాలయ ఉద్యోగాల్లో ఆరు విభాగాల్లో పోస్టులు మిగిలిపోతున్నాయి. గురువారం విడుదలైన ఫలితాల్లో కేటగిరీల వారీగా అర్హత మార్కులు ఆధారంగా అర్హత సాధించినవారి వివరాలు ప్రకటించారు. కొన్ని విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల కంటే అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉందని తేలింది. 
పశుసంవర్థక సహాయకుల పోస్టులు 9,886 ఉండగా, వీటికి దరఖాస్తులే 6,265 వచ్చాయి. అందులోనూ 5,608 మంది పరీక్షలు రాయగా, 2,163 మంది అర్హత సాధించారు. అంటే అర్హత పొందినవాళ్లు కాకుండా ఇంకా 7,723 పోస్టులు మిగిలిపోనున్నాయి.

ఇంకా పంచాయితీ కార్యదర్శి (గ్రేడ్‌-6) డిజిటల్‌ సహాయకుల పోస్టులు 11,158 ఉండగా, 3,623 మంది అర్హత సాధించారు.

వార్డు పారిశుద్ధ్య, పర్యావరణ కార్యదర్శి పోస్టులు 3,648 ఉండగా, 1,474 మంది మాత్రమే అర్హత పొందారు.
గ్రామఉద్యాన సహాయకుల పోస్టులు 4 వేలుఉండగా, 2,622మంది అర్హత సాధించారు.

వార్డు ప్రణాళిక, రెగ్యులేషన్‌ కార్యదర్శి పోస్టులు 3,770 ఉండగా, 2,096 మంది అర్హత పొందారు.

గ్రామ వ్యవసాయ సహాయకుల పోస్టులు 6,714 ఉండగా, 6,239 మంది అర్హత పొందారు.

ఆరు రకాల పోస్టులు మిగిలిపోయాయి

రాష్ట్రవ్యాప్తంగా చాలా వరకూ సచివాలయ ఉద్యోగాలు మిగిలిపోయాయి. ముఖ్యంగా అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌, పశుసంవర్థక సహాయకులు, డిజిటల్‌ అసిస్టెంట్‌ పోస్టులతో పాటు పట్టణాల్లోని వార్డు శానిటేషన్‌-ఎన్విరాన్‌మెంట్‌, వార్డు ప్లానింగ్‌-రెగ్యులేషన్‌ సెక్రటరీ పోస్టులకు.. అంటే ఆరు రకాల పోస్టులకు సరిపడా అర్హులు లేరు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అదృష్టవంతులని చెప్పవచ్చు. మళ్లీ నోటిఫికేషన్‌ ఇచ్చి భర్తీ చేయకుండా.. అర్హత మార్కులను తగ్గించి, ఆ మేరకు మార్కులు వచ్చిన వారిని తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :