Thursday, September 12, 2019

సోషల్ మీడియాతో ఆధార్ లింక్ .యూఐడీఏఐకి కేంద్రం లేఖ



Read also:

సోషల్ మీడియాతో ఆధార్ లింక్ . . యూఐడీఏఐకి కేంద్రం లేఖ . . బ్యాంకు ఖాతా , పాన్ కార్డు , రేషన్ కార్డు , ఇతర ప్రభుత్వ పథకాలు . . ఇలా అన్నింటికీ ఆధార్ కార్డును అనుసంధానం చేసేస్తున్నారు . పథకాలు లబ్దిదారులకే అందేలా ప్రభుత్వం ఆధార్ ను లింక్ చేస్తోంది . అసాంఘిక శక్తులను పారదోలడానికి కూడా దీన్ని ఉపయోగిస్తోంది . తాజాగా , సోషల్ మీడియాను ఆధార్ తో లింక్ చేసే విషయంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిన విషయం తెలిసిందే . అయితే , ఆధార్ తో అనుసంధానం చేయడంపై తమ అభిప్రాయం చెప్పాలని యూఐడీఏఐని కేంద్ర ఎలక్ట్రానిక్స్ , ఐటీ శాఖ కోరింది . ఈ మేరకు యూఐడీఏఐకి లేఖ రాసినట్లు ఐటీ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు . సోషల్ మీడియా ఖాతాలతో ఆధార్ నంబరును అనుసంధానించడానికి సంబంధించిన ఒక పిటిషన్ పై సుప్రీంకోర్టు గత నెలలో కేంద్రానికి నోటీసులు ఇచ్చింది .

వాస్తవానికి . . అసాంఘిక చర్యలకు , అశ్లీల కంటెంట్ కు అడ్డుకట్ట వేసేందుకు సోషల్ మీడియా అకౌంట్లను ఆధార్ తో లింక్ చేయాలని తమిళనాడు ప్రభుత్వం ఆదేశించింది . దీంతో ఫేస్ బుక్ సుప్రీం కోర్టు మెట్లు ఎక్కింది . ఇవే డిమాండ్లతో మద్రాస్ , బాంబే , మధ్యప్రదేశ్ హై కోర్టుల్లో పలు కేసులు పెండింగ్ లో ఉన్నాయి . వాటన్నింటినీ విచారించాలంటూ ఫేస్ బుక్ కోరింది . 

తమిళనాడు ప్రభుత్వ ఆదేశాలు యూజర్ల ప్రైవసీకి భంగం కలిగిస్తాయంటూ ఫేస్ బుక్ వాదిస్తోంది . అయితే ఓ మెసేజ్ ఎవరు పోస్ట్ చేశారో తెలుసుకునేందుకు సోషల్ మీడియా అకౌంట్లను ఆధార్ తో లింక్ చేయడం అవసరం అని , ప్రొఫైల్స్ ట్రాక్ చేయడం సులువు అవుతుందన్నది పిటిషనర్లు వాదిస్తున్నారు . ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు భారత ప్రభుత్వానికి , తమిళనాడు పోలీసులకు , గూగుల్ , ట్విట్టర్ తదితర సోషల్ మీడియా సంస్థలకు నోటీసులు జారీ చేసింది . సెప్టెంబర్ 13 లోగా అభిప్రాయాలు తెలపాలని ఆదేశించింది . అయితే  దీనిపై ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఐటీ శాఖ అధికారి తెలిపారు .

ప్రస్తుతం ప్రభుత్వ పథకాలు , సబ్సిడీలు పొందే వారి బ్యాంకు ఖాతాలకు మాత్రమే ఆధార్ ను అనుసంధానించే అవకాశం ఉన్నందున కొత్తగా సోషల్ మీడియా ఖాతాలకు లింక్ చేయడం కష్టమని వెల్లడించారు . ఆధార్ చట్ట ప్రకారం భారత సంచిత నిధితో సంబంధం లేని విషయాలతో ఆధార్ నంబరును అనుసంధానించడం కుదరదని ఆయన స్పష్టం చేశారు .

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :