Saturday, September 21, 2019

3000jobs notifications



Read also:

గ్రామ సచివాలయంలో జాబ్ రాలేదా ?అయితే ఈ 30 , 000 ఉద్యోగాలకు ట్రై చేయండి

ఆంధ్రప్రదేశ్ గ్రామ , వార్డు సచివాలయ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి .19.50 లక్షల మంది పరీక్ష రాస్తే 1 ,98,164 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు . అంటే సుమారు 2 లక్షలు మాత్రమే . అంటే 17.50 లక్షల మంది అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ గ్రామ , వార్డు సచివాలయ పరీక్షల్లో క్వాలిఫై కాలేదు .గ్రామ ,వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు దొరక్కపోయినా.మరో 30,000 పైగా జాబ్స్ రెడీగా ఉన్నాయి . 
లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా - LIC
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ - IBPS ,
ఆర్మీ వెల్ ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ - AWES ,
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ - SSC నోటిఫికేషన్లల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలున్నాయి .
వాటితో పాటు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ - CISF ,
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - RBI జాబ్స్ కూడా ఉన్నాయి.
ఈ నోటిఫికేషన్లకు దరఖాస్తు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.ఆంధ్రప్రదేశ్ గ్రామ,వార్డు సచివాలయ పరీక్షల్లో అర్హత సాధించనివారంతా వారివారి అర్హతలకు తగ్గ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు .

సెప్టెంబర్ 17న లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా - LIC దేశవ్యాప్తంగా 8500 పైగా అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది .సెంట్రల్ , ఈస్టర్న్ , ఈస్ట్ సెంట్రల్ , నార్తర్న్ , నార్తర్న్ సెంట్రల్ , సదరన్ , సౌత్ సెంట్రల్ , వెస్టర్న్ జోన్లకు వేర్వేరుగా నోటిఫికేషన్లు ఉన్నాయి .డిగ్రీ పాసైనవాళ్లు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు .దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది . దరఖాస్తుకు అక్టోబర్ 1 చివరి తేదీ .

ఇటీవల 12 , 074 క్లర్క్ పోస్టుల భర్తీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ - IBPS నోటిఫికేషన్ జారీ చేసింది . తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 1389 ( తెలంగాణ - 612 , | ఆంధ్రప్రదేశ్ - 777 ) పోస్టులున్నాయి . దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఈ పోస్తుల్ని భర్తీ చేస్తోంది ఐబీపీఎస్ . ఈ పోస్టులకు కూడా డిగ్రీ అర్హత . కంప్యూటర్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సర్టిఫికెట్ / డిప్లొమా ! డిగ్రీ ఉండాలి . దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది .దరఖాస్తుకు 2019 అక్టోబర్ 9 చివరి తేదీ . 

దేశవ్యాప్తంగా ఉన్న ఆర్మీ పబ్లిక్ స్కూళ్లల్లో 8000 పైగా టీచర్ ఉద్యోగాల భర్తీకి కొన్ని రోజుల క్రితం ఆర్మీ వెల్ ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ - AWES నోటిఫికేషన్ జారీ చేసింది . పీఆర్టీ , టీజీటీ , పీజీటీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది . దరఖాస్తుకు 2019 సెప్టెంబర్ 21 చివరి తేదీ . పీజీ , డిగ్రీ , బీఈడీ , డిప్లొమా చదివినవాళ్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు .

మెట్రో రైలులో ఉద్యోగాలు చేయాలనుకునేవారి కోసం మహా ముంబై మెట్రో ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ MCL సంస్థలో భాబ్స్ ఉన్నాయి . ముంబై మెట్రోలో 1053 నాన్ ఎగ్జిక్యూటివదస్టుల భరిగుంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ - MIRDA నోటిఫికేషన్ జారీ చేసింది . దరఖాస్తుకు 2019 అక్టోబర్ 7 చివరి తేద.

పోలీస్ ఉద్యోగం చేయాలనుకునేవారి కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ - SSC నోటిఫికేషన్ జారీ చేసింది . ఎస్ఐ , ఏఎస్ఐ పోస్టుల్ని భర్తీ చేస్తోంది . ఈ పోస్టులకు డిగ్రీ కనీస అర్హత . దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది . దరఖాస్తుకు అక్టోబర్ 16 చివరి తేదీ .

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ - CISF కూడా కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది . మొత్తం 914 ఉద్యోగాలున్నాయి . దరఖాస్తు ప్రక్రియ 2019 సెప్టెంబర్ 23న ప్రారంభం కానుంది . దరఖాస్తుకు అక్టోబర్ 22 చివరి తేదీ .

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :