Tuesday, September 24, 2019

22 members selected for Ambedkar Foreign Scholarship



Read also:

షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు చెందిన విద్యార్థులకు విదేశీ విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తోన్న అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం కింద లబ్ధిపొందేందుకు 22 మంది గిరిజన విద్యార్థులను ఎంపిక చేసినట్లు గిరిజన సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి ఆర్‌పీ సిసోడియా తెలిపారు. సోమవారం విజయవాడలోని గిరిజన సంక్షేమశాఖ కార్యాలయంలో జరిగిన రాష్టస్థ్రాయి సెలక్షన్ కమిటీ సమావేశానికి చైర్మన్, గిరిజన సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఆర్‌పీ సిసోడియా, కమిటీ కన్వీనర్, గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్ పి రంజిత్ బాషా ఇతర సభ్యులు హాజరయ్యారు. ఈ పథకం కింద లబ్ధిపొందేందుకు మొత్తం 26 మంది దరఖాస్తు చేసుకోగా వీరిలో 22 మందిని అర్హులుగా ఎంపిక చేయడం జరిగింది.

ఎంపికైన విద్యార్థుల్లో 12 మంది ఫిలిప్పీన్స్, ఇద్దరు చైనా దేశాల్లో వైద్య విద్యను అభ్యసించేందుకు వెళ్తుండగా ఆరుగురు యూకే, ఇద్దరు జర్మనీ దేశాల్లో పీజీ కోసం వెళ్తున్నట్లు గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్ రంజిత్ బాషా పేర్కొన్నారు. వీరికి రెండు దశల్లో రూ.15 లక్షల ఆర్థిక సాయం అందచేస్తారన్నారు. ఇందులో తొలుత 50శాతం, మిగిలిన మొత్తం సగం కోర్సు పూర్తి అయిన తరువాత విడుదల చేస్తారన్నారు. అలాగే విద్యార్థులకు వీసా ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయడంతో పాటు ఒక వైపు ప్రయాణానికి అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. విద్యార్థుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా జరిగినట్లు రంజిత్ బాషా స్పష్టం చేశారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :