Thursday, August 8, 2019

Take care while book a ticket in irctc sites



Read also:

రైలు టికెట్ బుక్ చేస్తున్నారా? జాగ్రత్త అంటున్న ఐఆర్ సీటీసీ IRCTC
ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్. ప్రయాణికులకు రైలు టికెట్ బుకింగ్ సేవల దగ్గర్నుంచి కేటరింగ్, టూర్ సర్వీసుల్ని అందించే సంస్థ. నిత్యం లక్షలాది మంది ఐఆర్ సీటీసీ మొబైల్ యాప్, వెబ్ సైట్ల ద్వారా రైలు టికెట్లు బుక్ చేస్తుంటారు. ఇతర సేవలు పొందుతుంటారు. అయితే ఆన్ లైన్ లావాదేవీల విషయంలో జాగ్రత్త అని హెచ్చరిస్తోంది ఐఆర్ సీటీసీ. అప్రమత్తంగా లేకపోతే సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోవాల్సి వస్తోందని వార్నింగ్ ఇస్తోంది. మరి టికెట్  బుకింగ్ తో పాటు ఐఆర్ సీటీసీ మొబైల్ యాప్, వెబ్ సైట్లలో లావాదేవీల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఐఆర్ సీటీసీ ఇస్తున్న సూచనలేంటో తెలుసుకోండి.
Train-ticket
1. అకౌంట్ నెంబర్, ఏటీఎం కార్డ్, పిన్, టీబన్, సీవీవీ, యూపీఐ వివరాలు ఎవరికీ వెల్లడించొద్దు.
2. ఫోన్, ఎస్ఎంఎస్, ఇ-మెయిల్ ద్వారా ఎవరైనా ఈ సమాచారాన్ని అడిగితే తిరస్కరించండి.
3. కాల్ చేసిన వ్యక్తులు తాము ఫలానా అధికారులమని చెప్పినా నమ్మొద్దు. ఎలాంటి వివరాలు వెల్లడించొద్దు. 
4. మీ బ్యాంకు వివరాలు వెల్లడిస్తే మోసపోయే ప్రమాదం ఉంది.
5. మీ ఖాతా వివరాలు చెప్పాలంటూ ఐఆర్ సీటీసీ నుంచి ఎలాంటి కాల్స్ రావన్న విషయం గుర్తుంచుకోండి. 
6. ఐఆర్ సీటీసీ యూజర్ ఐడీ, పాస్వర్డ్ లాంటి వివరాలు కూడా ఎవరికీ వెల్లడించకూడదు.
7. మీరు రైలు టికెట్ క్యాన్సిల్ చేస్తే రీఫండ్ ఇప్పిస్తామని ఎవరైనా మీ వివరాలు అడిగినా చెప్పకూడదు. 
8. రీఫండ్, టీడీఆర్ లాంటివి ఆన్లైన్ లో ఆటోమేటిక్ గా జరిగిపోతాయి. ఇందులో వ్యక్తుల ప్రమేయం ఉండదు. 
9. రీఫండ్, టీడీఆర్ లాంటి వాటిలో ఏవైనా అనుమానాలు ఉంటే నేరుగా ఐఆర్ సీటీసీ కాల్ సెంటర్ కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవాలి. 
10. ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ లో ఉన్న నెంబర్లకే కాల్ చేయాలి. గూగుల్ తో పాటు ఇతర సెర్చ్ ఇంజిన్ ప్లాట్ ఫామ్స్లో ఐఆర్ సీటీసీ పేరుతో ఉండే నెంబర్లకు కాల్ చేయకూడదు. 
11.మీ రైలు బుకింగ్ లేదా క్యాన్సలేషన్ వివరాలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్లో షేర్ చేయకూడదు. ఆ వివరాలు నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. 
12. మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ డీటైల్స్ ని ఐఆర్ సీటీసీ ప్రతినిధులు ఎవరూ అడగరు. ఎవరికీ షేర్ చేయకూడదు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :