Wednesday, August 7, 2019

Sushma swaraj is no more



Read also:

సుష్మ స్వరాజ్ కన్నుమూత కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ కు గుండెపోటు రావడంతో ఎయిమ్స్ ఆస్పత్రిలో కన్నుమూశారు.  గత కొంతకాలంగా గుండెకు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సుష్మా స్వరాజ్ మంగళవారం రాత్రి 10:45 నిమిషాలకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఆమెను అత్యవసరంగా ఎయిమ్స్కు తరలించారు.
sushmaswaraj
అయితే చికిత్స అందిస్తుండగానే మధ్యలోనే సుష్మా కన్నుమూశారు. ఆమె మరణం బీజేపీ నేతలకు తీరని లోటు. అయితే ఇప్పటికే కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, హర్షవర్ధన్ ఎయిమ్స్కు చేరుకున్నారు. కాగా నిన్న ఆర్టికల్ 370 రద్దుపై స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ చివరిసారిగా ట్వీట్ చేశారు.

 అయితే ఆమె గుండెపోటుతో ఎయిమ్స్ ఆస్పత్రిలో అత్యవసర చికిత్స కోసం చేరినప్పటికీ కొన్ని ప్రముఖ టీవీలు ఆమె మరణించిందని బ్రేకింగ్ న్యూస్ వేసి, ట్విట్టర్ లో ట్విట్ చెయ్యడం వల్ల అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే ఉన్నట్టుండి ఆ ప్రముఖ టీవీ ఛానళ్లు, న్యూస్ మీడియా ట్వీట్లు డిలీట్ చెయ్యడం వల్ల నెటిజన్లు ఫేక్ న్యూస్ అంటూ ట్వీట్ చేశారు. కానీ చివరికి వారు పెట్టిన న్యూస్ నిజం కావడం వల్ల, సుష్మ స్వరాజ్ ఇక లేరు అని తెలియడంతో సుష్మ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :