Sunday, August 25, 2019

సౌత్ సెంట్రల్ రైల్వేలో జాబ్స్



Read also:

సౌత్ సెంట్రల్ రైల్వేలో జాబ్స్ . దరఖాస్తుకు 2 రోజులే గడువు
సౌత్ సెంట్రల్ రైల్వే గ్రూప్ సీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది . 21 పోస్టులకు క్రీడాకారుల నుంచి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది . నోటిఫికేషన్ వివరాలను సౌత్ సెంట్రల్ రైల్వే అధికారిక వెబ్ సైట్ https://scr.indianrailways.gov.in / ఓపెన్ చేసి చూడొచ్చు . దరఖాస్తు చేయడానికి ఆగస్ట్ 26 చివరి తేదీ . అస్సాం , మేఘాలయ , మణిపూర్ , అరుణాచల్ ప్రదేశ్ , మిజోరాం , నాగాల్యాండ్ , త్రిపుర , సిక్కిం , జమ్మూ కాశ్మీర్ , హిమాచల్ ప్రదేశ్ లోని లాహోల్ , సిటి జిల్లాలు , పాంజీ సబ్ డివిజన్ , అండమాన్ నికోబార్ దీవులు , లక్షద్వీప్ ప్రాంతాల వారికి దరఖాస్తుకు సెప్టెంబర్ 11 చివరి తేదీ . పదో తరగతి లేదా ఎస్ఎస్ సీ పాసైనవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు . టెక్నికల్ ట్రేడ్స్ పోస్టులకు ఐటీఐ తప్పనిసరి . వయస్సు 18 నుంచి 25 ఏళ్ల లోపు ఉండాలి . జనరల్ కేటగిరీ అభ్యర్థులకు రూ . 500 , ఎస్సీ , ఎస్టీ , మహిళలు , మైనారిటీ , ఆర్థికంగా బలహీన వర్గాలకు ఫీజు రూ . 250 . పరీక్ష తేదీ త్వరలో వెల్లడించనుంది సౌత్ సెంట్రల్ రైల్వే . South Central Railway.
Recruitment 2019 : క్రీడలకు కేటాయించిన పోస్టుల వివరాలు
ఆర్చరీ ( మహిళలు ) - 2 
అథ్లెటిక్స్ ( పురుషులు ) - 3 
అథ్లెటిక్స్ ( మహిళలు ) - 1 
బాల్ బ్యాడ్మింటన్ ( పురుషులు ) - 1 
బాస్కెట్ బాల్ ( పురుషులు ) - 1
బాస్కెట్ బాల్ ( మహిళలు ) - 1 
బాక్సింగ్ ( పురుషులు ) - 1 
చెస్ ( పురుషులు ) - 1 
హ్యాండ్ బాల్ ( పురుషులు ) - 2 
హాకీ ( పురుషులు ) - 1 
కబడ్డీ ( పురుషులు ) - 1 
కబడ్డీ ( స్త్రీలు ) - 1 
టెన్నిస్ ( పురుషులు ) - 1 
వాలీబాల్ ( పురుషులు ) - 1 
వాలీబాల్ ( మహిళలు ) - 1 
వెయిట్ లిఫ్టింగ్ ( పురుషులు ) - 1 
వెయిట్ లిఫ్టింగ్ ( మహిళలు ) - 1 
మొత్తం పోస్టులు - 21

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :