Friday, August 16, 2019

Realme5



Read also:

Realme5:కెమెరాలు 4, బ్యాటరీ 5,000 ఎంఏహెచ్... ధర రూ.10 వేల లోపే కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా?
అయితే ఓ వారం ఆగండి. రియల్ మీ నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్ రాబోతోంది. ఆగస్ట్ 20న రియల్ మీ 5 సిరీస్ ఇండియాలో రిలీజ్ కాబోతోంది. ఈ ఫోన్ కు సంబంధించిన టీజర్స్ స్మార్ట్ ఫోన్ యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోన్ కు సంబంధించిన ఒక్కో ఫీచర్ ను అధికారికంగా వెల్లడిస్తోంది రియల్ మీ. 5 సిరీస్ స్మార్ట్ ఫోన్లలో నాలుగు కెమెరాలు ఉంటాయని ఇప్పటికే ప్రకటించిన రియల్ మీ మరిన్ని విషయాలు వెల్లడించింది. 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా ఫోన్ ను ఇండియాలో తొలిసారిగా లాంచ్ చేస్తున్నామని ట్వీట్ చేసింది రియల్ మీ. అంతేకాదు రూ.10,000 లోపే నాలుగు కెమెరాలతో ప్రపంచంలోనే తొలిసారి ఇండియాలో ఫోన్ రిలీజ్ చేస్తున్నట్టు వెల్లడించింది. ఇక పవర్ ఫుల్ క్వాల్కమ్ చిప్ సెట్ ఉండబోతోందని కంపెనీ ప్రకటించింది. స్నాప్డ్రాగన్ 665 చిప్ సెట్ ఉండొచ్చని భావిస్తున్నారు.
Realme5

రియల్ మీ 5 సిరీస్ కు సంబంధించి చాలా పుకార్లు ఉన్నాయి. అయితే కంపెనీ మాత్రం అధికారికంగా ఒక్కో విషయాన్ని వెల్లడిస్తోంది. ఇప్పటికే ఈ ఫోన్ కు సంబంధించిన వివరాలు ఫ్లిప్ కార్ట్ లో కనిపిస్తున్నాయి. రియల్ మీ 5 స్మార్ట్ ఫోన్లలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండబోతోందని కంపెనీ ప్రకటించింది.
రియల్ మీ 5 సిరీస్ లో రెండు స్మార్ట్ ఫోన్లు ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది. రియల్ మీ 5 స్మార్ట్ ఫోన్ తో పాటు రియల్ మీ 5 ప్రో రిలీజ్ చేసే అవకాశముంది. ఇండియాలో రియల్ మీ 1, 2, 3 సిరీస్ స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేసిన కంపెనీ... 4 సిరీస్ వదిలేసి నేరుగా 5 సిరీస్ తీసుకొస్తోంది. చైనాలో 4 అంకెను అన్ లక్కీ నెంబర్ గా భావిస్తారు కాబట్టే కంపెనీ 4 సిరీస్ రిలీజ్ చేయట్లేదన్న ప్రచారం ఉంది. 
ఇక రియల్ మీ 5 సిరీస్ గురించి ప్రచారంలో ఉన్న స్పెసిఫికేషన్స్ ఇవే. రియల్ మీ 5 స్పెసిఫికేషన్స్ (అంచనా)
డిస్ప్లే: 6.53 అంగుళాలు 
ర్యామ్: 3 జీబీ, 4 జీబీ 
ఇంటర్నల్ స్టోరేజ్: 32 జీబీ, 64 జీబీ 
ప్రాసెసర్: స్నాప్ డ్రాగన్ 665
రియర్ కెమెరా: 48 మెగాపిక్సెల్ (క్వాడ్ కెమెరా)
ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :