Friday, August 23, 2019

రేషన్ కార్డు దారులకు గమనిక : EKYC గడువు పెంపు



Read also:

తెల్లరేషన్ కార్డులో EKYC (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) అనుసంధానం గడువును పెంచారు. పౌర సరఫరాల శాఖ నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్లలోపు పిల్లలకు సెప్టెంబర్ 15 వరకు అవకాశం కల్పించినట్లు..సెక్రటరీ కోన శశిధర్ వెల్లడించారు. తొలుత ఆగస్టు 20 వరకు తుది గడువు విధించిన సంగతి తెలిసిందే. ఈ పాస్ మెషిన్లలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడం..కొందరు కార్డు దారుల వేలి ముద్రలు సరిపోకపోవడంతో సమస్యలు వచ్చాయి. దీంతో ఈకేవైసీ వ్యవహారం ఇబ్బందికరంగా మారింది.
డీలర్ల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా..ఈకేవైసీ అనుసంధానం కాకపోవడంతో ప్రజలు నిరుత్సాహానికి గురవుతున్నారు. ఇప్పటికీ లక్షలాది కార్డు దారులు వేలి ముద్రలు వేయించుకోలేని పరిస్థితి ఏర్పడింది గడువును పెంచాలని పౌరసరఫరాల శాఖ డిసైడ్ అయ్యింది.

మరోవైపు 15 ఏళ్లలోపు పిల్లలకు విద్యాశాఖ, స్త్రీ, శిశు సంక్షేమ ద్వారా ఈకేవైసీ నమోదు ప్రక్రియ కొనసాగుతోందని ఎక్స్‌ఆఫిషియో సెక్రటరీ కోన శశిధర్ తెలిపారు. మూడు నెలల్లోగా ఆయా పాఠశాలలో పూర్తి చేస్తామని..సంబంధిత అధికారులను తల్లిదండ్రులు సంప్రదించాలని సూచించారు. పిల్లలను ఆధార్ కేంద్రాలకు తీసుకెళ్లి వ్యవప్రయాసాలకు గురి కావద్దన్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :

1 Comments:

Write Comments