Wednesday, August 7, 2019

how to pen drive connects to your phone



Read also:

how to pen drive connects to your phone

డేటా స్టోరేజీ విషయంలో వినియోగదార్లను తృప్తిపర్చడం ఏ కంపెనీకీ సాధ్యపడదేమో. ఇటీవల కాలంలో డేటా స్టోరేజీ విపరీతంగా పెరిగిపోయింది. స్మార్ట్ ఫోన్, ట్యాబ్, సిస్టమ్... ఏదైనాకానీ... స్టోరేజీ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. ఇంటర్నల్ స్టోరేజే కాకుండా ఎక్సర్నల్ స్టోరేజీనీ వినియోగదారులు వదిలి పెట్టడంలేదు. ఈ కోవలోనే స్మార్ట్ ఫోన్లలో ఇప్పటికే జీబీల కొద్ది డేటా స్టోరేజీ అందుబాటులో ఉంది.
otg
దాంతో పాటో సిస్టమ్లోకి బ్యాకప్ తీసుకునే సౌలభ్యమూ ఉంది. అయితే ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లకు పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసుకునే సదుపాయమూ అందుబాటులో ఉంది. దీంతో మొబైల్ వినియోగదారుల స్టోరేజీ సమస్యా తొలగిపోయినట్లే. చాలావరకు మార్కెట్లో అందుబాట్లో ఉన్న ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లో మైక్రోఎస్థీ స్లాట్ ను పలు కంపెనీలు అందిస్తున్నాయి. ఇంటర్నల్ గా విస్తరించుకోడానికి అవసరమైన కార్డ్ స్లాట్లు ఉండే ఫోన్లలో దాదాపుగా స్టోరేజ్ సమస్యలు తొలగినట్లేనని చెప్పవచ్చు!. కొన్ని సందర్భాల్లో ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లేదా టాబ్లెట్ కు పెన్ డ్రైవ్ ను కనెక్ట్ చేసుకునే అవకాశం ఉంటే బావుండునని అనిపిస్తుంది. ఆ కోరికను ఇప్పుడు చాలా సులభంగా తీర్చుకోవచ్చు. మన ఆండ్రాయిడ్ ఫోన్ కు పెన్ డ్రైవ్ ను కనెక్ట్ చేసుకోవాలంటే ముఖ్యంగాOnThe-Go (OTG) ఫీచర్ ఉండాలి. ఒకవేళ ఈ సదుపాయం మీ ఫోన్లో లేకపోతే... USB OTG checker యాప్ ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేసుకోవాలి. అప్పుడూ మీ ఫోన్ కు OTG సపోర్టు చేయకపోతే... ఫోన్ ను రూట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీ ఫోన్ కు USB OTG సపోర్ట్ లభిస్తుంది. ఆ తర్వాత OTG కేబుల్ ను ఒకవైపు ఫోన్ కు, మరోవైపు పెన్ డ్రైవ్ కు కనెక్ట్ చేయాలి. అలా కనెక్ట్ అయిన వెంటనే యూఎస్బీ సింబల్ ఫోన్ స్క్రీన్ పై కనిపిస్తుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :