Monday, August 5, 2019

How to draw pf amount?



Read also:

పీఎఫ్ విత్‌డ్రా చేస్కోవాలడం ఎలా?

పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకోవడం సులువే. ఆన్‌లైన్‌లో కేవలం 5 నుంచి 10 రోజుల్లోనే పీఎఫ్ క్లెయిమ్ డబ్బుల్ని బ్యాంక్ ఖాతాకు పొందొచ్చు. అయితే ఇలా చేయాలంటే ఆధార్, యూఏఎన్ రెండూ అనుసంధానమై ఉండాలి.
PF-Withdraw

మీ పీ ఎఫ్  విత్‌డ్రా చేస్కోవాలంటే క్రింది షరతులను పాటించాలి
  1. పీఎఫ్ మొత్తాన్ని ఆన్‌లైన్‌లోనే సులభంగా విత్‌డ్రా చేసుకోవచ్చు
  2. యూఏఎన్‌తో ఆధార్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి
  3. ఇవి రెండు అనుసంధానమై ఉంటే.. 5-10 రోజుల్లోనే పీఎఫ్ డబ్బుల్ని అకౌంట్‌లోకి పొందొచ్చు.
పీఎఫ్ డబ్బుల్ని ఒకేసారి మొత్తంగా విత్‌డ్రా చేసుకోవడం కుదరదు. దీనికి చాలా నిబంధనలు ఉన్నాయి. ఉద్యోగ సర్వీస్, అవసరం ప్రాతిపదికన విత్‌డ్రా చుసుకునే మొత్తం ఆధారపడి ఉంటుంది. అనారోగ్యం, పెళ్లి ఖర్చులు, పిల్లల చదువు, ఇంటి కొనుగోలు, కొత్త ఇంటి నిర్మాణం, రుణ చెల్లింపులు వంటి సందర్భాల్లో ఈపీఎఫ్ మొత్తాన్ని ఉపసంహరించుకోగలం.

పీఎఫ్ డబ్బుల్ని ఆన్‌లైన్‌లో ఎలా విత్‌డ్రా చేసుకోవాలో చూద్దాం.. 
  • ఈపీఎఫ్‌వో యూనిఫైడ్ పోర్టల్‌ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/కు వెళ్లాలి.
  • తర్వాత యూఏఎన్, పాస్‌వర్డ్, క్యాప్‌చా సాయంతో లాగిన్ అవ్వాలి. ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. దీనికి కుడివైపు మెంబర్ ప్రొఫైల్ కనిపిస్తుంది. 
  • మేనేజ్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి. కేవైసీ ఆప్షన్ ఎంపిక చేసుకోండి. తర్వాతి పేజ్‌లో ఆన్‌లైన్ సర్వీసెస్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి. క్లెయిమ్ ఆప్షన్ ఎంచుకోండి. ఇక్కడ మెంబర్ వివరాలు చూడొచ్చు. బ్యాంక్ అకౌంట్ చివరి నాలుగు అంకెలు ఎంటర్ చేయండి. 
  • తర్వాతి పేజ్‌లో ఐ వాంట్ అప్లై ఫర్ వరుసలోని ఫామ్ 31 ఎంపిక చేసుకోండి. ప్రొసీడ్ ఫర్ ఆన్‌లైన్ క్లెయిమ్‌పై క్లిక్ చేయండి. 
  • ఈపీఎఫ్‌వో మీ కేవైసీ వివరాలను స్వీకరిస్తుంది. పీఎఫ్ క్లెయిమ్ ప్రక్రియ ప్రారంభమౌతుంది. అప్రూవల్ లభించిన ఐదు నుంచి పది రోజులలోపు మీ బ్యాంక్ అకౌంట్‌లో పీఎఫ్ డబ్బులు జమవుతాయి.
Check the Pf official website for more information

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :