Saturday, August 10, 2019

Google can also read whats app messages



Read also:

Google can also reag whats app messages

గూగుల్ వర్చువల్ అసిస్టెంట్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో ముందుకొస్తుంది. ఇప్పటివరకు ఫోన్ ఇన్ బాక్స్లోని మెసేజ్ లను మాత్రమే చదివి వినిపించే గూగుల్ అసిస్టెంట్ ఇకపై 'వాట్సాప్, టెలిగ్రామ్, స్లాక్' వంటి థర్డ్ పార్టీ యాప్లకు సంబంధించిన మెసేజ్ లను కూడా చదివి వినిపిస్తుంది. ఇంతకుముందు ఈ ఫీచర్ గూగుల్ యాప్స్కు మాత్రమే పరిమితం. త్వరలో అందుబాటులోకి రానున్న అప్డేట్ తో ఈ ఫీచర్ ను యూజర్లు వాడుకోవచ్చు.
Google-can-also-read-whats-app-messages
ప్రస్తుతం మెసేజ్ లు చదివే ఫీచర్ ఇంగ్లీష్ కే పరిమితం . ఇతర భాషల్లో అవకాశం లేదు. వాట్సాప్, టెలిగ్రామ్ వంటి యాప్లలో టెక్స్ట్ మెసేజ్ లు మాత్రమే చదువుతుంది. ఒకవేళ మెసేజ్ లలో ఫొటోలు, వీడియోలు ఉంటే 'ద మెసేజ్ జస్ట్ కంటైన్స్ఎన్ ఆడియో/వీడియో అటాచ్ మెంట్' అని చదివి వినిపిస్తుంది. ఈ ఫీచర్ డ్రైవింగ్లో ఉండి మొబైల్ వాడలేనప్పుడు, వంట చేస్తున్నప్పుడు, ఏదైనా పని చేస్తూ బిజీగా ఉన్నప్పుడు ఉపయోగపడుతుంది. అయితే మెసేజ్ లను బయటికి గట్టిగా చదివి వినిపించినా పర్లేదనుకునేవాళ్లు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :