Friday, August 16, 2019

fingerprint for all google related apps



Read also:

Google : ఇక పాస్వర్డ్ అవసరం లేదు .  లాగిన్ కోసం ఫింగర్ ప్రింట్ చాలు పాస్వర్డ్ సెట్ చేసుకోవడం ఎంత కష్టమో . గుర్తుంచుకోవ కూడా అంత కష్టం . రకరకాల యాప్స్ వాడుతుండటం , ఒక్కో యాప్లో ఒక్కో పాస్వర్డ్ సెట్ చేసుకోవడంతో గుర్తుంచుకోవడం కష్టమవుతుంది యూజర్లకు . అందుకే గూగుల్ ఈ సమస్యకు పరిష్కారం కనుగొంది . ఇకపై గూగుల్ వెబ్ సైట్స్లో లాగిన్ చేయడానికి పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు . మీ ఫింగర్ ప్రింట్ చాలు . పాస్వర్డ్ కన్నా ఫింగర్ ప్రింట్ బేస్డ్ వెరిఫికేషన్ బెటర్ అని గూగుల్ భావిస్తోంది . . అందుకే గూగుల్ ప్లాట్ ఫామ్స్లో లాగిన్ కావడానికి పాస్వర్డ్ కన్నా ఫింగర్ ప్రింట్ మేలని అనుకుంటోంది. 

గూగు ప్లే సర్వీసెస్ అప్డేట్ ద్వారా ఆండ్రాయిడ్ 7 కన్నా ఎక్కువ ఉన్న ఫోన్లకు త్వరలో ఈ సర్వీస్ అందుబాటులోకి రానుంది . ఇప్పటికే పిక్సెల్ డివైజ్ లకు అందుబాటులోకి వచ్చింది . ఇప్పటికే ఫింగర్ ప్రింట్ ఆథెంటికేషన్ ను చాలా వెబ్ సైట్స్ , యాప్స్ ఉపయోగిస్తున్నాయి . ముఖ్యంగా బ్యాంకింగ్ యాప్స్ ఆథెంటికేషన్ , వెరిఫికేషన్ కోసం ఫింగర్ ప్రింట్ ఉపయోగిస్తున్నాయి . ఇప్పుడు గూగుల్ కూడా అదే టెక్నాలజీని ఉపయోగించుకుంటోంది . ఇది గూగుల్ సర్వీసులకు మాత్రమే . అంటే జీమెయిల్ , గూగుల్ ఫోటోస్ , గూగుల్ మ్యాప్స్ లాంటి గూగుల్ ప్లాట్ ఫామ్స్లో లాగిన్ కావాలంటే ఫింగర్ ప్రింట్ ఉపయోగించుకోవచ్చు . గూగుల్ యాప్స్తో పాటు వెబ్ సైట్స్లోనూ ఫింగర్ ప్రింట్ ఆథెంటికేషన్ పనిచేస్తుంది . ఫింగర్ ప్రింట్ ఆథెంటికేషన్ ఉంటే యూజర్ పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు వేలిముద్ర ద్వారా లాగిన్ కావడం సులువు అవుతోంది .

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :