Monday, August 5, 2019

Do you know how much RAM is on your smart phone?



Read also:

Do you know how much RAM is on your smart phone?

మీరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా? మీ ఫోన్లో ర్యామ్ ఎంత? 2 జీబీ, 3 జీబీ లేదా 4జీబీనా? ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ 8 జీబీ ర్యామ్ వరకు వస్తున్నాయి. కానీ ఓ పదేళ్లు వెనక్కి వెళ్తే తొలి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ HTC Dream ర్యామ్ ఎంతో తెలుసా? 192 ఎంబీ మాత్రమే. ఇంటర్నల్ స్టోరేజీ 256 ఎంబీ. ఇప్పుడు హెచ్డీ క్వాలిటీలో చిన్న వీడియో రికార్డ్ చేస్తేనే అంతకన్నా ఎక్కువ ఎంబీ స్పేస్ కావాలి.
Samrtphone-ram-size
కానీ పదేళ్ల క్రితం స్మార్ట్ ఫోన్లో కేవలం 192 ఎంబీ ర్యామ్ మాత్రమే ఉందంటే నమ్ముతారా? అంతేకాదు... 3.15 మెగాపిక్సెల్ కెమెరా, 1,150 ఎంఏహెచ్ బ్యాటరీతో ఉండేది ఆ ఫోన్. ఇప్పుడు ర్యామ్ 8 జీబీ, బ్యాటరీ 5000 ఎంఏహెచ్ ఉంటున్నాయి. అంతేకాదు... త్వరలో 12 జీబీ ర్యామ్ తో స్మార్ట్ ఫోన్లు రాబోతున్నాయి. ఇలా ర్యామ్ పెంచుకుంటూ పోవడం అవసరమా? అసలు స్మార్ట్ ఫోన్ కు ఎంత ర్యామ్ ఉండాలి? తెలుసుకోండి. స్మార్ట్ ఫోన్ పెర్ఫామెన్స్ బాగుండాలన్నా, మల్టీ-టాస్కింగ్లో సమస్యలు రావొద్దన్నా ర్యామ్ చాలా ముఖ్యం. ప్రాసెసర్ ఒక్కటే బాగుంటే సరిపోదు... ర్యామ్ కూడా సరిపడా ఉండాలి. ఒకేసారి మూడునాలుగు యాప్స్ ఓపెన్ చేసినా ర్యామ్ ఎక్కువగా ఉంటే సమస్యలు రావు.

కానీ సగటు యూజర్ ఎంత ర్యామ్ ఉన్న ఫోన్ తీసుకుంటే సరిపోతుందో అవగాహన ఉన్నవాళ్లు తక్కువే. స్మార్ట్ ఫోన్ కంపెనీలు మాత్రం ర్యామ్ పెంచుకుంటూ పోతున్నాయి. ఆఫీసులో లేదా ఇంట్లో వాడే కంప్యూటర్, ల్యాప్టాప్లో ఉండే ర్యామ్ కన్నా స్మార్ట్ ఫోన్ లోనే ర్యామ్ ఎక్కువగా ఉంటోంది. మరి అంత ర్యామ్ వాడేస్తున్నారా? అంటే అనుమానమే. యాపిల్ ఫోన్ తో పోలిస్తే ఆండ్రాయిడ్ ఫోన్ కు ర్యామ్ కాస్త ఎక్కువగానే ఉండాలి. ఎందుకంటే ఆండ్రాయిడ్ యాప్స్ ఎక్కువ ర్యామ్ ఉపయోగిస్తుంటాయి. ఏ స్మార్ట్ ఫోన్ అయినా రెండుమూడేళ్లు వాడిన తర్వాత ఔట్ డేట్ అయినట్టు అనిపిస్తుంది. ఐదారేళ్ల క్రితం 1 జీబీ లేదా 2 జీబీ ర్యామ్తో స్మార్ట్ ఫోన్లు చక్కగా వాడుకునేవారు. 

ఇప్పుడు 4 జీబీ కావాల్సిందే. ప్రస్తుత అవసరాలను బట్టి చూస్తే స్మార్ట్ ఫోన్ ను తక్కువగా ఉపయోగించేవారికి 2జీబీ ర్యామ్ ఉన్న ఫోన్ సరిపోతుంది. కాస్త ఎక్కువగా ఉపయోగించేవాళ్లయితే 3జీబీ ర్యామ్ ఉన్న ఫోన్ తీసుకోవచ్చు. ఒకవేళ స్మార్ట్ ఫోన్ లో యాప్స్ ఎక్కువగా వాడుతున్నారంటే 4జీబీ ర్యామ్ ఉన్న ఫోన్ తీసుకోవాల్సిందే. అంతకన్నా ఎక్కువ ర్యామ్ ఉన్న ఫోన్లు పెద్దగా అవసరమే ఉండదు. 4జీబీ ర్యామ్తో స్మార్ట్ ఫోన్ ను చక్కగా ఉపయోగించుకుంటున్నప్పుడు 6జీబీ, 8జీబీ ర్యామ్ ఉన్న ఫోన్లు అవసరమే లేదు. ఓ రెండేళ్ల తర్వాత అయితే అప్పటి యాప్స్, అవసరాలను బట్టి 6జీబీ లేదా 8జీబీ ర్యామ్ కి మారవచ్చు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :