Thursday, August 29, 2019

ఇకపై అందరూ ట్రాఫిక్ పోలీసులే.. ఏపీ సర్కార్ కొత్త రూల్



Read also:

ఇకపై అందరూ ట్రాఫిక్ పోలీసులే.. ఏపీ సర్కార్ కొత్త రూల్
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఏపీ సర్కార్ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. రూల్స్‌ను అతిక్రమించి ఎవరైనా ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్, సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నట్లు కనిపిస్తే వెంటనే ఫోటో తీసి ఏపీ రవాణా శాఖకు పంపవచ్చు. ఇందుకుగానూ రవాణాశాఖ ప్రత్యేక వాట్సాప్ నెంబర్ 9542800800 కేటాయించింది. సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమలులోకి వస్తున్న నేపథ్యంలో ఈ వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టారు.
జస్ట్ ఒక క్లిక్.. ఎవరైనా ఎక్కడైనా ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లు కనిపిస్తే ఫోటో తీసి ఈ నెంబర్‌కు వాట్సాప్ చేస్తే చాలు. రవాణాశాఖ వెంటనే చర్యలు తీసుకుంటుందని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.
విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్స్‌ను అతిక్రమించిన వారి ఇంటికే జరిమానా పంపుతామన్నారు. చలాన్లు కట్టనవారి లైసెన్స్ రద్దు అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :