Monday, August 5, 2019

Bank transactions alert due to holidays effect



Read also:

Bank transactions alert due to holidays effect

మీ ట్రాన్సాక్షన్స్ ప్లాన్ చేసుకోండి బ్యాంకింగ్... ప్రతీ ఒక్కరూ ఏదో ఓ సందర్భంలో బ్యాంకు సేవలు వినియోగించుకోవాల్సిందే. ఈమధ్య కాలంలో ఆన్ లైన్ బ్యాంకింగ్ పెరిగిపోవడంతో బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకపోయినా... ఇప్పటికీ కొన్ని పనుల కోసం బ్యాంకు మెట్లు ఎక్కక తప్పట్లేదు. అందుకే బ్యాంకులో లావాదేవీలు ఏవైనా జరపాలనుకుంటే ముందుగానే బ్యాంకుల సెలవుల గురించి తెలుసుకోవడం అవసరం. సాధారణంగా నిబంధనల ప్రకారం రెండో, నాలుగో శనివారంతో పాటు ఆదివారాలు బ్యాంకులకు సెలవు.
Bank-holidays
ఇవి కాకుండా పబ్లిక్ హాలిడేస్ వస్తుంటాయి. ఆగస్ట్ లో రెండు పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయి. నాలుగు ఆదివారాలున్నాయి. వీటితో పాటు రెండో, నాలుగో శనివారం కూడా బ్యాంకులు బంద్. అంటే... ఆగస్ట్ లో 8 రోజుల పాటు బ్యాంకులకు తాళం పడే అవకాశముంది. ఆగస్ట్ లో బ్యాంకులకు ఏఏ తేదీల్లో సెలవులు ఉన్నాయో తెలుసుకోండి. ఆగస్ట్ లో బ్యాంకులకు సెలవులు ఉండే తేదీలు ఇవే.

ఆగస్ట్ 4- ఆదివారం
ఆగస్ట్ 10- రెండో శనివారం
ఆగస్ట్ 11- ఆదివారం
ఆగస్ట్ 12-బక్రీద్
ఆగస్ట్ 15- ఇండిపెండెన్స్ డే, రాఖీ పౌర్ణమి 
ఆగస్ట్ 18-ఆదివారం
ఆగస్ట్ 24- నాలుగో శనివారం
ఆగస్ట్ 25- ఆదివారం

ఆగస్ట్ 10 నుంచి ఆగస్ట్ 12 వరకు వరుసగా మూడు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. రెండో శనివారం, ఆదివారం, బక్రీద్ వరుసగా రావడంతో లాంగ్ వీకెండ్ రానుంది. కాబట్టి ముఖ్యమైన బ్యాంకు లావాదేవీలు ఏవైనా ఉంటే ఈ సెలవుల్ని గుర్తుంచుకొని ప్లాన్ చేసుకోవడం మంచిది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :