Saturday, August 31, 2019

Attention taxpayers for e-filing income tax returns last date



Read also:

Attention taxpayers for e-filing income tax return last date (31-08-2019)

ఐటీ రిటర్నులపై వచ్చిన వార్తలన్నీ అవాస్తవం


ఆదాయపు రిటర్నులు దాఖలుకు గడువు పెంచుతున్నట్టు వచ్చిన వార్తల్ని ఐటీ శాఖ ఖండించింది. అవన్నీ తప్పుడు వార్తలేనని స్పష్టం చేస్తూ ట్వీట్‌ చేసింది. 2018-19 సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పణకు గడువు రేపటి వరకే ఉందని స్పష్టం చేసింది.
ITReturnsFiling

కేంద్ర ప్రభుత్వం ఐటీ రిటర్నుల దాఖలు చేసేందుకు మరింత గడువు ఇచ్చిందని.. రిటర్నులు దాఖలు చేసేందుకు మరో నెల రోజులు (సెప్టెంబర్‌ 30) వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) ఉత్తర్వులు జారీ చేసినట్టు సామాజిక మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో అప్రమత్తమైన ఐటీ శాఖ అవన్నీ తప్పుడు వార్తలేనని కొట్టిపారేసింది. సాధారణంగా గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించడానికి చివరి తేదీ జులై 31. అయితే రిటర్నులు దాఖలు చేసేటప్పుడు సమస్యలు తలెత్తుతున్నాయని, గడువు తేదీని పెంచాలని పలు వర్గాల నుంచి అభ్యర్థనలు రావడంతో రిటర్నుల దాఖలుకు ఆగస్టు 31 వరకు సమయమిచ్చిన విషయం తెలిసిందే.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :