Monday, August 5, 2019

WhatsApp and Instagram names are changed



Read also:

WhatsApp and Instagram names are changed

 ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఎవరికి ఏ మెసేజ్ పంపాలన్నా, వీడియో షేర్ చేయాలన్నా, సోషల్ మీడియా వేగవంతమైన సమాచార వ్యవస్థగా మారిపోయింది. నేడు అందరి చేతుల్లో ఉన్న సెల్ ఫోన్ ద్వారా సెకన్లు, నిమిషాల్లో వార్త మనకు చేరుతుంది. ఇదంతా సోషల్ మీడియా పుణ్యమే. సోషల్ మీడియాలో ప్రధాన పాత్ర పోషిస్తోన్న ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ గురించి తెలీని సగటు మనిషి నేడు ఉండరు.
whatsapp&instagram names has been changed
వీటిని ఉపయోగించని వారు కూడా ఉండరంటే ఆశ్చర్యమే. ప్రజలకెంతో దగ్గరైన వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ ల పేర్లు మారబోతున్నాయి. అవును.. ఇది నిజం. వాట్సప్, ఇన్ స్టా కూడా ఫేస్ బుక్ యాజమాన్యానివే. వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ మెసేజింగ్ వ్యవస్థనంతా ఫేస్ బుక్ నడిపిస్తోంది. మెసేజింగ్ మెర్జింగ్ ద్వారా ఈ మూడు వ్యవస్థలు ఒకటే అని వినియోగదారులు గుర్తించేందుకు వీటి పేర్లు మార్చేందుకు శ్రీకారం చుట్టామని ఫేస్ బుక్ అధికారులు ప్రకటించారు. వీటి పేర్లను.. ఇన్ స్టాగ్రామ్ ఫ్రమ్ ఫేస్ బుక్ వాట్సాప్ ఫ్రం ఫేస్ బుక్గా  మారే అవకాశం ఉంది.

మార్కెట్ లో వస్తున్న గట్టి పోటీ ని తట్టుకునేందుకే ఫేస్ బుక్ ఈ మార్పులు చేయాలని నిర్ణయించిందని ఫేస్ బుక్ అధికార ప్రతినిధి బెర్టీ థాంప్సన్ వాల్ స్ట్రీట్ జనరల్ కు పంపిన మెయిల్ ద్వారా తెలిపారు. నిజానికి వీటి పేర్లను మార్చాలని ఫేస్ బుక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జుకర్ బర్గ్ గతేడాదే కంపెనీ సీనియర్ అధికారులతో చర్చించారు. అప్పట్లో ఈ నిర్ణయాన్ని తోసిపుచ్చారు. కానీ, మార్కెట్ లో వస్తున్న పోటీని బట్టి మళ్లీ ఈ అంశం తెర మీదకి వచ్చిందని కంపెనీ వర్గాలు అంటున్నాయి. వీటి పేర్లను ఎప్పటి నుంచి అధికారికంగా మారబోతున్నాయో తెలియాల్సి ఉంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :