Wednesday, August 21, 2019

ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాల మోత



Read also:

తరచూ నగర, పట్టణ రహదారుల్లో సొంత వాహనాలపై ప్రయాణించే మధ్య తరగతి ప్రజలు ఇకపై మరింత అప్రమత్తంగా ప్రయాణించాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే రోడ్డు నిబంధనలు అతిక్రమించిన వారికి ట్రాఫిక్‌ పోలీసులు విధించే జరిమానాలు (చలాన్‌) ఇక మరింత ప్రియం కానున్నాయి. పేద, మధ్యతరగతి ప్రజలు ఈ చలానాల బారి నుంచి తప్పించుకోవాలంటే ఇకపై కచ్చితంగా రోడ్డు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.
UpdatedRT)FinesList
1988 నాటి మోటారు వాహనాల చట్టానికి గత నెల పార్లమెంటులో సవరణలు చేసిన సంగతి తెలిసిందే. మోటారు వాహనాల (సవరణ) చట్టం-2019 ప్రకారం కొత్త జరిమానాలు వచ్చే నెల మొదటి తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.

ఏ ఉల్లంఘనకు ఎంతంటే.
  1. అత్యవరసర వాహనాలైన ఫైర్‌ ఇంజిన్‌, అంబులెన్స్‌ వంటి వాటికి దారి ఇవ్వకపోతే రూ.10 వేలు జరిమానా విధిస్తారు. 
  2. ఇప్పటివరకూ రూ.100 జరిమానా ఉన్న ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు రూ.500 చలానా విధించే వెసులుబాటు ఉంటుంది. 
  3. అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తే రూ.2 వేలు
  4. లైసైన్స్‌ ఇంటివద్ద మర్చిపోతే రూ.5 వేలు
  5. వాహనం ఇన్సూరెన్స్‌ కాపీ లేకుండా ప్రయాణిస్తూ పట్టుబడితే రూ.2 వేలు పెనాల్టీలు విధించనున్నారు.
  6. రోడ్డుపై అనుమతించిన వేగం కన్నా ఓవర్‌ స్పీడ్‌తో ప్రయాణిస్తే రూ.వెయ్యి నుంచి రూ.2 వేలు.
  7. సీట్‌బెల్టు లేకుండా ప్రయాణిస్తే రూ.వెయ్యి వరకూ జరిమానాలు విధిస్తారు. 
  8. ఇక ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తూ శిరస్త్రాణం ధరించకపోతే రూ.వెయ్యి కట్టాల్సిందే. 
  9. పరిమితికి మించి లోడ్‌తో వెళ్లే వాహనాలకు రూ.20 వేలు.
  10. ర్యాష్‌ డ్రైవింగ్‌కు రూ.వెయ్యి నుంచి రూ.5 వేలు చలానా వేస్తారు. 
  11. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో దొరికితే రూ.10 వేలు సమర్పించుకోవాల్సి ఉంటుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :