Wednesday, August 21, 2019

ఆరోగ్య ప్రదాయిని-తిప్పతీగ



Read also:

ఆరోగ్య ప్రదాయిని . . తిప్పతీగ . . ! మన చుట్టూ ఉన్న ప్రకృతిలో మనకు ఆరోగ్యాన్ని అందించే ఎన్నో రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి . కానీ చాలా వరకు మొక్కల 
గురించి మనకు తెలియదు . అలాంటి మొక్కల్లో తిప్పతీగ కూడా ఒకటి . ఇది మన ఇంటి పరిసరాల్లో , చుట్టు పక్కలా పెరుగుతుంది . కానీ దీని గురించి చాలా మందికి అవగాహన లేదు . తిప్పతీగను ఎక్కువగా ఆయుర్వేద ఔషధాల తయారీలో వాడుతారు . దీన్ని ఇంగ్లీష్లో గిలోయ్ అని , సంస్కృతంలో అమృత అని పిలుస్తారు . ఈ క్రమంలోనే తిప్పతీగ వల్ల మనం ఎలాంటి అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందామా . . ! 

1 . తిప్పతీగ ఆకుల చూర్ణాన్ని నిత్యం తీసుకుంటే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది . ముఖ్యంగా ఈ సీజన్ లో వచ్చే జ్వరాలు , వ్యాధులు , ఇన్ ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది . తిప్పతీగలో ఉండే యాంటీ బయోటిక్ , యాంటీ వైరల్ , యాంటీ ఫంగస్ గుణాలు మన శరీరంలో చేరే సూక్ష్మ క్రిములను నాశనం చేస్తాయి . 
2 . తిప్పతీగ ఆకుల పొడిని బెల్లంలో కలుపుకుని నిత్యం తింటే అజీర్తి తగ్గుతుంది . దీంతోపాటు జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది .
3 . డయాబెటిస్ ఉన్నవారు తిప్పతీగ చూర్ణాన్ని నిత్యం ఉదయం , సాయంత్రం తీసుకుంటే ఫలితం ఉంటుంది . రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించుకోవచ్చు .
4 . నిత్యం ఒత్తిడి , మానసిక ఆందోళనలతో సతమతం అయ్యేవారు తిప్పతీగ చూర్ణాన్ని రోజూ తీసుకుంటే ఫలితం ఉంటుంది . జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది . 
5 . దగ్గు , జలుబు , టాన్సిల్స్ తదితర శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు తిప్పతీగ చూర్ణాన్ని వాడితే ఫలితం ఉంటుంది . 
6 . ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కొద్దిగా తిప్పతీగ చూర్ణం , అల్లం రసం కలిపి నిత్యం రెండు పూటలా తాగుతుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి .

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :