Saturday, August 24, 2019

సర్వీసులో ఉంటూ మృతి చెందితే పూర్తి సంపాదిత సెలవులు మంజూరు



Read also:

సర్వీసులో ఉంటూ మృతి చెందితే పూర్తి సంపాదిత సెలవులు మంజూరు ౼జీవో నెంబరు 234 ద్వారా.
Go-234

  • సర్వీసులో ఉండగా మృతి చెందిన ఉద్యోగులకు పూర్తి సంపాదిత సెలవులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 
  • ఇప్పటివరకు లేని ఈ సదుపాయాన్ని కొత్తగా కల్పిస్తూ జీవో నెంబరు 234 విడుదల చేసింది. ఉద్యోగులు ఉద్యోగ విరమణ చేసే సమయంలో వారు సర్వీసులో దాచుకున్న సంపాదిత సెలవులను నగదుగా మార్చుకునే అవకాశం ఇప్పటికే ఉంది. 
  • ఏడాదికి  ఆరు సెలవులు చొప్పున సర్వీసు మొత్తంలో 250 వరకు దాచుకునే వెసులుబాటు ఉంది. 
  • ఇటీవల సంపాదిత సెలవులను సైతం 300కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులు  ఉద్యోగ విరమణ చేసే సమయానికి ఎంత జీతం పొందుతున్నారో దాని ప్రకారం ఒకరోజు జీతాన్ని లెక్కగట్టి ఎన్ని సంపాదిత సెలవులు ఉంటే అంతమేర నగదు చెల్లించే పద్ధతి ప్రస్తుతం అమల్లో ఉంది. 
  • ఈ పరిమితిని పెంచడంతో గరిష్ఠంగా 300 సెలవులు నిల్వ ఉంచుకుని నగదు పొందే వెసులుబాటు ఇప్పుడు ఉద్యోగులకు కలిగింది. 
  • ఇదే సమయంలో మరో నిర్ణయం  తీసుకుంటూ ప్రభుత్వ జీవో  నెంబరు 234  విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల మేరకు సర్వీసులో ఉండి  ఏ కారణం చేతనైనా ఉద్యోగి మృతి చెందితే.. సంపాదిత సెలవులు ఎన్ని ఉన్నా మొత్తం 300 సెలవులకు వేతనం లెక్కగట్టి  ఇస్తారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :

1 Comments:

Write Comments
Jaswanth
AUTHOR
November 9, 2019 at 2:48 PM delete

సర్వీస్ లో ఉంటూ చనిపోతే పూర్తి సంపాదిత సెలవు మంజూరు go234 post చెయ్యగలరు

Reply
avatar