Wednesday, August 28, 2019

ఉద్యోగుల పీఎఫ్‌ వాటా తగ్గింపు



Read also:

ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు శుభవార్త. ఈపీఎఫ్‌ స్కీం కింద ఉద్యోగులు తమ వాటా గా చెల్లించే మొత్తాన్ని తగ్గించాలని కేంద్ర కార్మిక శాఖ ప్రతిపాదించింది. దీంతో ఉద్యోగులకు చేతికొచ్చే వేతనం పెరుగుతుంది. అయితే ఉద్యోగులందరికీ పీఎఫ్‌ కాంట్రిబ్యుషన్‌ మొత్తం ఒకేతీరుగా ఉండదు. వారి వయస్సు, మహిళ లేదా పురుషుడు, వారి వేతన గ్రేడ్‌ వంటి విషయాలను పరిగణనలోకి తీసుకొని పీఎ్‌ఫకు ఉద్యోగుల వాటా ఎంత చెల్లించాలన్నది నిర్ణయిస్తారు. సంస్థల యాజమాన్యాల వాటాలో ఎలాంటి మార్పు ఉండదు. ప్రస్తుతం ఉద్యోగులు తమ బేసిక్‌ వేతనంలో 12ు చొప్పున, యాజమాన్యాలు కూడా అంతే శాతం తమ వాటాగా ఈపీఎఫ్‌కు చెల్లిస్తున్నాయి. ఉద్యోగుల చెల్లింపు వాటాను తగ్గిస్తూ కార్మిక శాఖ ఈపీఎఫ్‌ సవరణ బిల్లు (2019)ని రూపొందించింది. పింఛను పథకంలో కూడా ప్రభుత్వం మార్పులు తీసుకురానున్నది.
PF
ప్రస్తుతం అమలవుతున్న ఉద్యోగి పింఛను పథకం(ఈపీఎ్‌స)తోపాటు జాతీయ పింఛను పథకం(ఎన్‌పీఎ్‌స)లో ఏదో ఒకదాని లో చేరే అవకాశం ఉద్యోగికి కల్పిస్తారు. ఈ బిల్లుపై ఉద్యోగ, కార్మిక సంఘాలు, పీఎఫ్‌ సభ్యులు, ఆయా సంస్థల యాజమాన్యాలు తమ అభ్యంతరాలను సెప్టెంబరు 22లోగా ప్రభుత్వానికి పంపించాల్సి ఉంటుంది. 2004 జనవరి 1 తర్వాత సర్వీసులో చేరేవారికి ఎన్‌పీఎస్‌ అమలవుతున్న సంగతి తెలిసిందే. కాగా, సామాజిక భద్రతా ప్రయోజనాలను మరింతగా విస్తరించాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వం.. డ్రైవర్లు, ఇంటి పనివారు, స్వయం ఉపాధి పొందుతున్న వారికి కూడా పీఎఫ్‌ ప్రయోజనాలను కల్పించడంపై దృష్టి పెట్టింది. అసంఘటిత రంగంలోని వారికి ఇప్పటికే ప్రధానమంత్రి శ్రమ్‌యోగి మాన్‌ ధన్‌ పెన్షన్‌ పథకాన్ని మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరింత లబ్ధి కలిగించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే పీఎఫ్‌ వర్తింపజేసేలా ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ అండ్‌ మిస్‌లేనియస్‌ ప్రావిడెంట్‌ చట్టానికి సవరణలు చేయనుంది. ఈ దిశగా రూపొందించిన ప్రతిపాదనలపై వచ్చే నెల 22 వరకూ ప్రజాభిప్రాయాలు కోరుతోంది.

Benfits

  • దీంతో పెరగనున్న ‘చేతికొచ్చే వేతనం’
  • పింఛను స్కీములో కూడా మార్పులు
  • డ్రైవర్లు, ఇంటి పనివారికీ పీఎఫ్‌ లబ్ధి
  • చట్ట సవరణకు ప్రభుత్వం యోచన

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :