Monday, August 19, 2019

Dark chocolates for reducing depression



Read also:

డిప్రెషన్ ను తగ్గించే డార్క్ చాక్లెట్ ! డార్క్ చాక్లెట్ తినడం వలన పలుప్రయోజనాలను పొందవచ్చన్న విషయం గతంలో నిర్వహించిన పలు అధ్యయనాల్లో వెల్లడైంది . ఇప్పుడో మరో ప్రయోజనం పొందవచ్చన్న విషయం తాజాగా స్పష్టమైంది . డార్క్ చాక్లెట్ తినడం వలన డిప్రెషన్ మూడ్ నుంచి బయటపవచ్చన్న విషయం తాజా అధ్యయనాల్లో తేలింది . 

సుమారు 14వేల మంది మీద అధ్యయనం చేశారు . వీరి ఎత్తు , బరువు , ఆరోగ్యం తదితర విషయాలను పరిగణనలోకి తీసుకొని కొందరికి రోజు మొత్తం మీద ఎక్కువ మోతాదులో చాక్లెట్ ఇచ్చారు . మరికొందరికి తక్కువ మోతాదులో చాక్లెట్ ఇచ్చారు . అనంతరం వీరిని పరిశీలించగా , ఎక్కువ మొత్తంలో చాక్లెట్ తీసుకున్న వారిలో డిప్రెషన్ లక్షణాలు 70 శాతం తక్కువగా కనిపించాయి . తక్కువ తీసుకున్న వారిలో 25 శాతం మాత్రమే కనిపించాయి . అయితే డార్క్ చాక్లెట్ తీసుకున్నందువలనే వీరిలో డిప్రెషన్ లక్షణాలు తక్కువగా కనిపించాయా ? లేక మరేదైనా కారణముందా ? అన్న విషయం మీద ఇంకా అధ్యయనాలు నిర్వహించాలని వారు చెబుతున్నారు 

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :

1 Comments:

Write Comments