Sunday, August 18, 2019

రూపే కార్డు వినియోగదారులకు బంపర్ ఆఫర్... 10 లక్షల ఇన్సురెన్స్ ఫ్రీ



Read also:

రూపే కార్డు వినియోగదారులకు బంపర్ ఆఫర్... 10 లక్షల ఇన్సురెన్స్ ఫ్రీ
ఏటీఎం కార్డు... ఇది వచ్చాక బ్యాంకుకు సంబంధించిన లావాదేవీల ప్రక్రియ చాలా సులభం అయిపోయింది. ఎంతలా అంటే.. ఇదివరకు బ్యాంకు నుంచి డబ్బు డ్రా చేసుకోవాలంటే గంటలకు గంటలు క్యూలో వేచి ఉండాల్సిన పరిస్థితి. పనులన్నీ మానుకొని మరీ బ్యాంకుల ముందు క్యు కట్టేవారు. ఎప్పుడైతే ఏటీఎంలు వచ్చాయో.. ఏటీఎం కార్డుల ద్వారా బ్యాంకులకు వెళ్లకుండానే డబ్బులను డ్రా చేసుకునే వెసులుబాటు వచ్చేసింది. అంతే కాదు.. ఏటీఎం కార్డు జేబులో ఉంటే అదో భరోసా. చేతిలో డబ్బు లేకున్నా ఏటీఎంకు వెళ్లి తీసుకోవచ్చనే ధీమా ఉంటుంది. అయితే.. ఏటీఎం కార్డు వల్ల కేవలం డబ్బు మాత్రమే తీసుకోగలమా?

ఇంకా దీని వల్ల ఎటువంటి బెనిఫిట్స్ లేవా?

అంటే ఖచ్చితంగా ఉన్నాయి. ఏటీఎం కార్డు వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయని మీకు ఇప్పటి వరకు తెలియదు. మరి.. అవేంటో ఓసారి తెలుసుకుందాం పదండి... 

సాధారణంగా చాలామంది బ్యాంకు ఖాతాదారులు మాస్టర్ కార్డు, వీసా కార్డును ఉపయోగిస్తుంటారు. అయితే... ఆన్ లైన్ లావాదేవీలను ప్రోత్సహించడం కోసం మోదీ ప్రభుత్వం రూపే కార్డు స్కీమ్ ను ప్రవేశపెట్టింది. 

ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన పథకం కింద రూపే కార్డును తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. జన్ ధన్ యోజన ద్వారా బ్యాంక్ అకౌంట్ తెరిచినవాళ్లకు రూపే కార్డును ఇస్తారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) ఈ కార్డును జారీ చేస్తుంది. ఏటీఎంలో నుంచి డబ్బులు డ్రా చేసుకోవడం దగ్గర నుంచి ఆన్ లైన్ లావాదేవీల వరకు రూపే కార్డు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. 

ప్రస్తుతం మార్కెట్ లో చాలా రకాల రూపే కార్డ్స్ ఉన్నాయి. అవి... రూపే క్లాసిక్ డెబిట్ కార్డ్, రూపే ప్లాటినం డెబిట్ కార్డ్, రూపే క్లాసిక్ క్రెడిట్ కార్డ్, రూపే పీఎంజేడీవై కార్డ్, రూపే ముద్ర డెబిట్ కార్డ్.

మిగితా కార్డుల్లా కాకుండా... ఈ కార్డులకు ప్రాసెసింగ్ ఫీ తక్కువగా ఉంటుంది. ఇంకా.. రూపే ప్రీమియం కార్డు ఉన్న వినియోగదారులకు 10 లక్షల వరకు ఉచితంగా జీవిత బీమా సౌకర్యం ఉంటుంది. అంటే... ప్రమాదవశాత్తు రూపే ప్రీమియం కార్డు హోల్డర్ మరణించినా... శాశ్వత వికలాంగులు అయినా 10 లక్షల వరకు ఇన్సురెన్స్ వర్తిస్తుంది. ఒకవేళ రూపే క్లాసిక్ కార్డు ఉన్న వినియోగదారులకు లక్ష రూపాయల ఇన్సురెన్స్ వర్తిస్తుంది. ఇన్సురెన్స్ ప్రీమియాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చెల్లిస్తుంది. 

దాంతో పాటు రూపే ప్లాటినం డెబిట్ కార్డు ఉన్న వాళ్లకు 30 డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుల లాంజ్ లలోకి ఉచిత ప్రవేశం ఉంటుంది. అలాగే... విదేశాల్లోని పీవోఎస్ పాయింట్ల వద్ద రూపే కార్డులను ఉపయోగిస్తే 10 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. విదేశాల్లోని ఏటీఎంలలో ఉపయోగిస్తే 5 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. 

రూపే కార్డు ద్వారా కరెంట్ బిల్లు చెల్లించినా, పెట్రోల్ కొట్టించినా, వాటర్ బిల్లు కట్టినా, గ్యాస్ బిల్లు పే చేసినా... క్యాష్ బాక్ లభిస్తుంది. 

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :