Saturday, July 20, 2019

Pan-Aadhar corrections through online



Read also:

Pan-Aadhar corrections through online

ఆన్‌లైన్ ద్వారా పాన్-ఆధార్ దిద్దుబాట్లు
In your aadhar card and pan card names are different. no need to worry, just spare some to get details as you look like. It is a simple process.
AAdhar-pan-corrections
ఆధార్, పాన్ కార్డులో పేర్లు వేర్వేరుగా ఉన్నాయా? ఇలా చేయండి మీరు ఆధార్ నెంబర్ ను పాన్ కార్డుతో లింక్ చేసేందుకు ప్రయత్నిస్తే ఎర్రర్ వచ్చిందా? రెండు కార్డులపై వివరాలు ఒకేలా లేకపోతే పాన్ కార్డుతో ఆధార్ నెంబర్ లింక్ కాకపోవచ్చు. మీ పేరు, పుట్టిన తేదీ లాంటి వివరాలు పాన్ కార్డులో, ఆధార్ కార్డులో ఒకేలా ఉండాలి. రెండు కార్డుల్లో పేరు ఒకేలా లేకపోవడం వల్ల సమస్యలు తప్పవు. ఒకట్రెండు అక్షరాలు తేడా ఉన్నా ఆధార్-పాన్ లింక్ కాకపోవచ్చు. బ్యాంకులో మీరు అకౌంట్ ఓపెన్ చేయడానికి ఈ ప్రూఫ్ సబ్మిట్ చేసినా దరఖాస్తు రిజెక్ట్ కావచ్చు. అందుకే ఇలాంటి సమస్యలు లేకుండా ఉండేందుకు మీ ఆధార్ కార్డులో, పాన్ కార్డులో మీ వివరాలన్నీ ఒకేలా ఉండాలి. మరి ఈ రెండు కార్డుల్లో పేర్లు వేర్వేరుగా ఉంటే సరిచేసుకోవాలి. మీ పేరు కరెక్టుగా ఏ కార్డుపైన ఉందో చూసి మరో కార్డులో పేరు మార్చుకోవాలి. మరి ఆధార్ కార్డులో, పాన్ కార్డులో పేరు ఎలా మార్చుకోవాలో తెలుసుకోండి.

ఆధార్ కార్డులో పేరు ఎలా మార్చాలి? 

  • ఆధార్ కార్డులో పేరు తప్పుగా ఉంటే ఆన్ లైన్ లో సరిచేసుకోవచ్చు. 
  • SSUP పోర్టల్ ఓపెన్ చేసి మీ వివరాలన్నీ ఎంటర్ చేయాలి.
  • ఆ తర్వాత మీరు పేరును అప్డేట్ చేయొచ్చు. మీరు దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత యూనిక్ రిక్వెస్ట్ నెంబర్-URN జనరేట్ అవుతుంది.
  • డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత రివ్యూ కోసం BPO సెలెక్ట్ చేసుకోవాలి. చివరగా మీరు మీ యూనిక్ రిక్వెస్ట్ నెంబర్-URN ద్వారా ఆధార్ అప్డేట్ స్టేటస్ తెలుసుకోవచ్చు.
  • ఆధార్ కార్డులో వివరాలు అప్డేట్ చేయడానికి ఎన్ రోల్ మెంట్ సెంటర్ కు కూడా వెళ్లొచ్చు.

పాన్ కార్డులో పేరు తప్పుగా ఉంటే ఎలా మార్చాలి?

  • పాన్ కార్డులో పేరు తప్పుగా ఉంటే సరిచేసుకోవడానికి https://www .onlineservices.nsdl.com/paamendUserRegisterContact.html వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • అప్లికేషన్ టైప్లో Changes or Correction in existing PAN Data/Reprint of PAN Card సెలెక్ట్ చేసుకోవాలి.
  • మీ పేరు, పుట్టిన తేదీ, పాన్ నెంబర్, ఇమెయిల్ ఐడీ లాంటి వివరాలన్నీ సరిగ్గా ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :