Monday, July 22, 2019

New Feature-without internet also we can transfer money



Read also:

New Feature without internet also we can transfer money

ఇంటర్నెట్ లేకుండానే Paytm ద్వారా డబ్బులు చెల్లించండి ఇలా... సహజంగా నోట్ల రద్దు ముందు వరకు Paytm యాప్ గురించి చాలా మందికి తెలియదు. ఆ తరువాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో దాదాపుగా మొబైల్ వాడుతోన్న ప్రతిఒక్కరి దగ్గర పేటీఎమ్ కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ తీసుకున్న నిర్ణయంతో డిజిటల్ లావాదేవీలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. అన్ని రకాల బిల్లు చెల్లింపులు దగ్గర నుంచి మనీ ట్రాన్స్ఫర్ వరకు ఆన్ లైన్ పేమెంట్ పోర్టల్స్ ద్వారానే జరగటం ప్రారంభమయ్యాయి.
paytm
అన్ని రకాల బిల్లు చెల్లింపులు దగ్గర నుంచి మనీ ట్రాన్స్ఫర్ వరకు ఆన్ లైన్ పేమెంట్ పోర్టల్స్ ద్వారానే జరగటం ప్రారంభమయ్యాయి.ఈ క్రమంలోనే పేటీఎమ్ తన కస్టమర్ బేస్ ను మరింతగా విస్తరించుకోగలిగింది. తాజా సదుపాయంతో ఇంటర్నెట్ తో పనిలేకుండా Paytm ద్వారా డబ్బులు పంపుకోవచ్చు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. - ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్న వారు తొలత తమ పేరిట ఓ Paytm అకౌంట్ ను ఓపెన్ చేసుకోవల్సి ఉంటుంది. ఇంటర్నెట్ కనెక్షన్ ను కలిగి ఉన్నస్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా Paytm | అకౌంట్ ను ఓపెన్ చేసుకోవచ్చు. మీ పేరిట Paytm అకౌంట్ క్రియేట్ అయిన వెంటనే credit/debit లేదా నెట్ బ్యాంకింగ్ ను ఉపయోగించుకుని మీ Paytm వాలెట్ లోకి నగదును యాడ్ చేసుకోండి. - డబ్బు మీ అకౌంట్ లో యాడ్ అయిన తరువాత Paytm సర్వీసులను ఉపయోగించుకుంటోన్నఏ మొబైల్ నెంబర్ కైనా ఇంటర్నెట్ కనెక్షన్ తో పనిలేకుండా నగదును ట్రాన్స్ఫర్ చేసుకునే వీలుంటుంది. ఇందుకుగాను 1800-1800-1234 నెంబర్ కు కాల్ చేయవల్సి ఉంటుంది. ఈ టోల్ ఫ్రీ నెంబర్ ను ఉపయగించుకోవటం ద్వారా యాప్ లోకి వెళ్లకుండానే నగదు చెల్లింపులను చేపట్టవచ్చు. - ఈ సర్వీసుకు సంబంధించిన బెనిఫిట్లను పొందే క్రమంలో యూజర్లు ముందుగా తమ మొబైల్ నెంబర్లతో పాటు 4 డిజిట్ల Paytm PINతో పేటీఎమ్ వెబ్ సైట్ లో రిజిస్టర్ కావల్సి ఉంటుంది. ఆ తరువాత 18001800–1234 నెంబర్ కు కాల్ చేసి మీరు నగదు పంపాలనుకుంటున్న వ్యక్తి మొబైల్ నెంబర్ అలానే అతని Paytm PIN వివరాలను తెలపటం ద్వారా నగదును ట్రాన్స్ఫర్ చేసే వీలుంటుంది. ఈ ప్రక్రియలో సెండర్ కు సంబంధించి పేటీఎమ్ వాలెట్ లోని నగదును రిసిప్టెంట్ పేటీఎమ్ వాలెట్ లోకి ట్రాన్స్ఫర్ చేయటం జరుగుతుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :