Wednesday, July 24, 2019

How to change aadhar card address through the online



Read also:

How to change aadhar card address through the online

We can change the aadhar card address through online ,no need to go for aadhar center. It is a simple process to change your address from your mobile phone only. The following is the process for changing the address in aadhar card.
Aadhar address change

ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్, అడ్రస్, పేరు... ఎలాంటి సమాచారం మార్చాలన్నా ఆధార్ సెంటర్లకు పరిగెత్తాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ప్రత్యేకించి ఆధార్ సెంటర్లకు వెళ్లాల్సిన పనిలేకుండా ఆన్ లైన్ లోనే ఆధార్ కార్డులో సమాచారాన్ని మార్చుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చేసింది. మీ ఆధార్ కార్డులో అడ్రస్ మార్చాలనుకుంటున్నారా? OTP ఆధారిత వెరిఫికేషన్ ద్వారా మీ అడ్రస్ ఈజీగా మార్చేసుకోవచ్చు. మీ ఆధార్ కార్డు.. మీ రిజిస్ట్రర్డ్ మొబైల్ నెంబర్‌తో అటాచ్ అయి ఉండాలి. ఆధార్ కార్డు యూజర్లు సమీపంలోని ఆధార్ సెంటర్లకు లేదా UIDAI వెబ్ సైట్ (uidai.gov.in) లాగిన్ కావొచ్చు.

* మీ రీసెంట్ ఫొటోను Scan చేసి Upload చేయాల్సి ఉంటుంది. (లేదా) ఒరిజనల్ అడ్రస్ ఫ్రూప్ (PoA) స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.
* మీరు ఇచ్చే ఫ్రూఫ్ డాక్యుమెంట్ కు.. అడ్రస్ అప్ డేట్/కరెక్షన్ రిక్వెస్ట్ ఫామ్ అటాచ్ చేయాల్సి ఉంటుంది.
* బ్యాంకు స్టేట్ మెంట్.. లేదంటే బ్యాంకు పాస్‌బుక్, పోస్టు ఆఫీసు అకౌంట్ స్టేట్ మెంట్/పాస్‌బుక్, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, గవర్నమెంట్ ఫొటో ఐడీ కార్డు/స్టేట్ రన్ కంపెనీలో సర్వీసు ఫొటో ఐడీ కార్డు, మ్యారేజీ సర్టిఫికేట్ (అడ్రస్‌తో కూడిన) వీటిలో ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఒక డాక్యుమెంట్‌ను అడ్రస్ ఫ్రూప్‌గా ఇవ్వొచ్చు.
* మూడు నెలల కరెంట్ బిల్లు రసీదు, వాటర్ బిల్లు, టెలిఫోన్ ల్యాండ్ లైన్ బిల్లు, గ్యాస్ కనెక్షన్స్ బిల్లు, ప్రాపర్టీ ట్యాక్స్ రిసిప్ట్, క్రెడిట్ కార్డు స్టేట్ మెంట్ కూడా ఆధార్ కార్డు అడ్రస్ ఫ్రూప్‌గా కూడా ఇవ్వొచ్చు.

ఆన్లైన్ లో ఆధార్ కార్డు అడ్రస్ ఎలా మార్చుకోవాలో చూద్దాం?

1. ఆధార్ అధికారిక వెబ్ సైట్ uidai.gov.inవిజిట్ చేయండి.
2. ఆధార్ సెల్ఫ్ సర్వీసు అప్ డేట్ పోర్టల్ My Aadhaar లింక్ పై Mouse కర్సర్ ఉంచండి.
3. Update Your Aadhaar అనే అప్షన్ కనిపిస్తుంది.
4. Update Your Address Online అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
5. 'proceed to update address' ఆప్షన్ పై క్లిక్ చేయండి.
6.  ఆధార్ నెంబర్, Captcha వెరిఫికేషన్ ఎంటర్ చేయండి.. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు OTP వస్తుంది.
7. ఆధార్ లో Log -in అవ్వండి. ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి.
8. అందులో ఒకటి.. డాక్యుమెంట్లు ఉంటే.. Update Address via అడ్రస్ ఫ్రూప్ పై క్లిక్ చేయండి.
9. ఒకవేళ డాక్యుమెంట్లు లేదంటే మాత్రం Update address via సీక్రెట్ కోడ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
10. డాక్యుమెంట్లు లేదు.. రిక్వెస్ట్ ఫర్ అడ్రస్ లెటర్ కోసం వేచి చూడాలి. 

* అప్డేట్  అడ్రస్  వయ  అడ్రస్ ప్రూఫ్ సెలెక్ట్ చేస్తే : 
1. కొత్త అడ్రస్ వివరాలు ఎంటర్ చేయండి. 
2. మీ డాక్యుమెంట్లు ఏమి ఉన్నాయో స్కాన్ చేసి అప్‌లోడ్ చేయండి. 
3. బిజినెస్ ప్రాసెస్ ఔట్ సోర్సింగ్ (BPO)సర్వీసు ప్రొవైడర్ ఆప్షన్ Select చేసుకోండి.
4. Submit రిక్వెస్ట్ బటన్ పై క్లిక్ చేయండి. 
* సీక్రెట్ కోడ్   ద్వారా అడ్రస్ మార్చాలంటే : 
1. మీ అడ్రస్ ప్రూఫ్ లేకపోతే.. సేమ్ అడ్రస్ లో ఉండే కుటుంబ సభ్యులు ఎవరిది అయిన ఉంటే వారి అడ్రస్ ప్రూఫ్ ఆధారంగా అథంటికేషన్ పూర్తి చేసుకోవచ్చు. 
2. 30 వర్కింగ్ డేస్ లో మీరు ఇచ్చిన అడ్రస్ కు సీక్రెట్ కోడ్ తో కూడిన లెటర్ పోస్టు ద్వారా వస్తుంది. 
3. కొత్త అడ్రస్ కోసం దరఖాస్తు చేసిన వ్యక్తితో పాటు, అడ్రస్ ప్రూఫ్ ఇచ్చిన వ్యక్తి మొబైల్ నెంబర్ కూడా ఆధార్ ఎటాచ్ అయి ఉండాలి.
4. లెటర్ అందుకున్నాక.. ఆన్ లైన్ అడ్రస్ అప్ డేట్ పోర్టల్ లాగిన్ కావాల్సి ఉంటుంది. 
5. అప్ డేట్ అడ్రస్ వయా సీక్రెట్ కోడ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
4. సీక్రెట్ కోడ్ ఎంటర్ చేసి అడ్రస్ వివరాలు రివ్యూ చేసి ఫైనల్ రిక్వెస్ట్ Submit పై క్లిక్ చేయండి.
5. మీకో 14అంకెల URN (Update Request Number) వస్తుంది.. భవిష్యత్తులో మీ ఆధార్ స్టేటస్ తెలుసుకోవడానికి ఈ నెంబర్ పనిచేస్తుంది. 

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :