Monday, July 22, 2019

Great Indian girl-got 5Gold medals in 1 month



Read also:

Great Indian girl-got 5Gold medals in 1 month

19 ఏళ్ల భారత చిరుత.. ఒకే నెలలో ఐదో గోల్డ్ మెడల్ 20 రోజుల్లో వరుసగా ఐదు గోల్డ్ మెడల్స్ దేశానికి గర్వకారణంగా నిలిచిన భారత ప్రింటర్ హిమదాస్ ఇండియా స్టార్ ప్రింటర్ హిమదాస్ 20 రోజుల వ్యవధిలో ఐదో స్వర్ణంతో సత్తా చాటింది. చెక్ రిపబ్లిక్ లో నొవ్ మెస్టో నాడ్ మెటుకి గ్రాండ్ ప్రిక్స్ లో అద్భుతమైన ప్రదర్శన చేసింది. 52.09 సెకండ్లలోనే 400మీటర్ల రేసును పూర్తిచేసింది.
Great-indian-girl-got5-gold-medals-in-one-month

2018 ఏషియన్ గేమ్స్ లో తన బెస్ట్ రన్ టైమ్ 50.79 రికార్డును ఆమె తిరగరాసింది. బంగారు పతకం గెల్చుకుంది. 20 రోజుల వ్యవధిలో హిమదాస్ అందుకున్న ఐదో గోల్డ్ కావడం గొప్ప విషయం. అంతకుముందు.. బుధవారం జరిగిన 200 మీటర్ల రేసును హిమదాస్ 23.25 సెకన్లలో ముగించి స్వర్ణం గెలిచింది. వీకే విస్మయ 23.43 సెకన్ల టైమింగ్తో రజతం గెలుచుకుంది. మెన్స్ 400 మీటర్ల రేస్ ను 45.40 సెకన్లలో పూర్తిచేసిన ఇండియా ప్రింటర్ మహ్మద్ అనాస్ గోల్డ్ మెడల్ గెలవగా, సహచర ప్రింటర్లు టామ్ నోహ్ నిర్మల్ (46.59 సెకన్లు), కేఎస్ జీవన్(46.60 సెకన్లు), ఎంపీ జబిర్(47.16 సెకన్లు) రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. ఇవి ఈనెలలో తొలి మూడు స్వర్ణాలు జులై 2న జరిగిన పొజన్ అథ్లెటిక్ గ్రాండ్ ప్రీలో 200 మీటర్ల రేస్ ను 23.65 సెకన్లతో పూర్తి చేసి తొలి గోల్డ్ గెలిచిన హిమ, 7వ తేదీన కుంటో అథ్లెటిక్ మీట్ లో 23.97 సెకన్ల టైమింగ్తో రెండో గోల్డ్ ను సాధించింది. 13వ తేదీన క్లాడ్నో అథ్లెటిక్ మీట్ లో 23.43 సెకన్లలో రేస్ పూర్తి చేసి మూడో గోల్డ్ ఒడిసిపట్టుకుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :