Monday, July 22, 2019

Ap Government released the pension increment from Monday



Read also:

Ap Government release the pension increment from Monday

పెంచిన 'ఆసరా పెన్షన్' ఈరోజు నుండే: నేరుగా లబ్దిదారుల అకౌంట్లలో పైసలు పెంచిన ఆసరా పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి అందజేయనుంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. లబ్దిదారులకు ఇప్పటికే పెన్షన్ పేపర్లను పంపిణీ చేసింది. దీంతో లబ్దిదారుల బ్యాంకు, పోస్టాఫీసు ఖాతాల్లో పెన్షన్లు జమకానున్నాయి. కొత్తగా మరో 7 లక్షల మంది వికలాంగులకు ఇస్తున్న రూ.1,500 పెన్షన్ ను రూ. _3,016కు.. వితంతువులు, గీత, చేనేత, బీడీ కార్మికులు, హెచ్ఐవీ, బోదకాలు బాధితులకు ఇస్తున్న రూ.1,000 పెన్షన్ ను రూ.2,016కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అలాగే పెన్షన్ అర్హత వయసును 62 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వం ఇప్పటి వరకు _39 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇస్తోంది. ఇందుకు రూ.5,500 కోట్లు ఖర్చు చేస్తోంది.
Ap Pension increment
వయసు తగ్గింపుతో పెన్షన్ తీసుకునే వారు కొత్తగా మరో 7 లక్షల మంది యాడ్ అవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, ఈ ఏడాది ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో పెన్షన్ల కోసం రూ.12,600 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది. నిదానంగా లబ్ధిదారుల ఎంపిక పెంచిన పెన్షన్ ను ఏప్రిల్ నుంచి ఇస్తామని సీఎం కేసీఆర్.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రకటించారు. కానీ జనవరి నుంచి వరుసగా గ్రామ పంచాయతీ, ఎమ్మెల్సీ, లోక్ సభ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగడం వల్ల లబ్దిదారుల ఎంపిక ఆలస్యమైంది. ప్రస్తుతం అన్ని జిల్లాల్లో పూర్తయినా, హైదరాబాద్ లో పెండింగ్లో ఉందని సెర్చ్ అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ కలెక్టరేట్, జీహెచ్ఎంసీ అధికారుల మధ్య సమన్వయం లోపం వల్ల ఆలస్యమవుతోందని అంటున్నారు. ఈనెల 25 కల్లా ఎంపిక పూర్తి చేయాల్సి ఉంది. కానీ 3 రోజులే గడువు ఉండటంతో ఆ లోగా అరుల ఎంపిక పూర్తి కాకపోవచ్చని తెలుస్తోంది. 25 కల్లా అరుల జాబితా ఖరారు చేసి ఇస్తేనే వచ్చే నెల కొత్త వాళ్లకు పెన్షన్ ఇవ్వటం సాధ్యమవుతుందని సెర్చ్ డైరెక్టర్ నవీన్ కుమార్ తెలిపారు. ప్రతినెల తగ్గుతున్నరు ప్రతి నెల ఆసరా పెన్షన్ తీసుకునే వారి సంఖ్య తగ్గుతోంది. యావరేజ్ గా 5 వేల మంది తగ్గుతున్నారని అధికారులు చెబుతున్నారు. జూన్
నెలలో
రాష్ట్రవ్యాప్తంగా 39,09,786 లక్షల మంది పెన్షన్ అందుకున్నారు. మున్సిపల్ ఎన్నికల కోసమేనా? రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కోడ్ వల్ల అడ్డంకులు ఎదురు కాకుండా ఉండేందుకే పెన్షన్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేసింది

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :